యూపీలో పీయూష్ జైన్ దుమారం.. అఖిలేష్‌పై మోదీ, అమిత్ షా సెటైర్లు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్ది రాజ‌కీయాలు మ‌రింత హీటెక్కుతున్నాయి. కాన్పూర్ అత్త‌రు వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో దొరికిన రూ.250 కోట్ల న‌గ‌దు వ్య‌వ‌హారం ఆర్థికంగానే కాకుండా రాజ‌కీయంగానూ పెద్ద దుమారం రేపుతోంది. దాదాపు రూ 1000 కోట్ల‌కు ప‌న్ను ఎగ‌వేత పాల్ప‌డిన‌ట్లు ఐటీ శాఖ వెల్ల‌డించింది. అత్త‌ర్ వ్యాపారి పియూష్ జైన్‌కు స‌మాజ్ వాదీ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్‌కు సంబంధాలు ఉన్నాయంటూ బీజీపీ ఆరోప‌ణ‌లు గుప్పింస్తోంది.

బీజేపీ క్రెడిట్‌ను లాగేసుకుంటున్నారు.. మరి నోట్ల కట్టలు వ్యవహారం..

బీజేపీ క్రెడిట్‌ను లాగేసుకుంటున్నారు.. మరి నోట్ల కట్టలు వ్యవహారం..

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కార్పూర్‌ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప్రధాని న‌రేంద్ర మోదీ వ్యాపారి పీయూష్ జైన్ వ్య‌వ‌హారాన్ని ప్ర‌స్తావిస్తూ స‌మాజ్ వాదీ పార్టీపై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృద్ధిని తాము చేసిందేన‌ని ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షం చెప్పుకుంటుంద‌ని విమ‌ర్శించారు. బీజేపీ క్రెడిట్‌ను లాగేసుకుంటున్నార‌ని అన్నారు. మ‌రి కాన్పూర్‌లో నోట్ల క‌ట్ట‌లు నిండిన బీరువాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌రి వాటికి ఎందుకు బాధ్య‌తగా తీసుకోవ‌డానికి ముందుకు రావ‌డంలేదంటూ అఖిలేష్ యాద‌వ్‌ను ఉద్దేశించి సెటైర్లు వేశారు మోదీ. నోళ్లు మూసుకుని కూర్చున్నారు వాళ్లంతా అని విమ‌ర్శించారు.

2017కి ముందు వ‌ర‌కు అత్త‌రు అవినీతి..

2017కి ముందు వ‌ర‌కు అత్త‌రు అవినీతి..


యూపీలో 2017కి ముందు వ‌ర‌కు అత్త‌రు అవినీతి ఏ విధంగా గుభాలించిందో అంద‌రికీ తెలుస‌ని ప్ర‌ధాని మోదీ విమ‌ర్శించారు. కాన్పూర్‌లో దొరికిన గుట్ట‌ల గుట్ట‌ల‌ నోట్ల క‌ట్ల వ్య‌వ‌హారాన్ని దేశం మొత్తం ఎంతో ఆస‌క్తిగా చూస్తోందన్నారు. ఇదే గ‌త వాళ్లు సాధించిన ప్ర‌గ‌తి అని మండిప‌డ్డారు. యూపీ ప్ర‌జ‌లు వాస్త‌వ పరిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు. కేంద్ర‌, రాష్ట్రాల్లో బీజేపీ ప్ర‌భుత్వం నిబ‌ద్ధ‌తో బాధ్యతాయుతంగా పనిచేస్తోంద‌ని చెప్పారు.

రూ3. 250 కోట్ల డబ్బు ఎక్క‌డ‌ది అఖిలేష్..

రూ3. 250 కోట్ల డబ్బు ఎక్క‌డ‌ది అఖిలేష్..


అటు సుల్తాన్‌పూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స‌మాజ్‌వాదీ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్ర‌జ‌ల‌ను మాయ చేసేందుకు అఖిలేష్ యాద‌వ్ నానాపాట్లు ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. స‌మాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ అత్త‌ర్ వ్యాపారి షియూష్ జైన్ అక్ర‌మ సంపాద‌న‌తో అడ్డంగా దొరికాడు. అదేమంటే మేము దాడులు చేయించామంటూ అఖిలేష్ మెలిక‌లు తిరుగుతున్నారు. మ‌రి సోదాల్లో దొరికిన రూ. 250 కోట్ల డబ్బు ఎక్క‌డ‌ది అఖిలేష్ అంటూ ప్ర‌శ్నించారు అమిత్ షా..

పీయూష్ జైన్ తో బీజేపీకే సంబంధం..?

పీయూష్ జైన్ తో బీజేపీకే సంబంధం..?


కాన్పూర్‌లో రూ.250 కోట్ల‌తో ప‌ట్టుబ‌డి అరెస్ట‌యిన అత్త‌రు వ్యాపారి పీయూష్ జైన్‌తో త‌మ పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌న్నారు స‌మాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్. కొత్త‌గా ముద్రించిన రూ 2000 నోట్ల‌ను స్వాధీనం చేసుకున్న ఐటీ, జీఎస్టీ అదికారులే వీటి మూలాల‌ను వెల్ల‌డిస్తార‌ని తెలిపారు. అటు పొర‌పాటున వాళ్లకు చెందిన వ్యాపారిపైనే బీజేపీ దాడులు చేయించుకుందంటూ కౌంట‌ర్ ఇచ్చారు అఖిలేష్‌. పీయూష్ జైన్ కాల్స్ డేటాను ప‌రిశీలిస్తే .. బీజేపీ నేత‌ల పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+