అక్కడి మెడికల్ కాలేజీల్లో 75 వేల సీట్లు..
PM Modi: దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్ది సేపటి కిందటే దేశ రాజధానిలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం వరుసగా ఇది 11వ సారి. 2014 ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆయన వరుసగా రెడ్ ఫోర్ట్‌పై మువ్వన్నెలను రెపరెపలాడించారు.
ఎర్రకోటకు చేరుకున్న వెంటనే త్రివిధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం త్రివర్ణ పతకాన్ని ఎగురువేశారు. ఆ సమయంలో వైమానిక దళానికి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు పూల వర్షాన్ని కురిపించాయి. అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు మోదీ.

వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా 2047 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, వాటిని అందుకోవడానికి రూపొందించుకున్న భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయులను స్మరించుకున్నారు. వారిని ఆజాదీ కే దీవానేగా అభివర్ణించారు. ఈ దేశం వారికి రుణపడి ఉంటుందని చెప్పారు.
ఇన్ని కోట్లమంది ప్రజల సంకల్పం.. ఇప్పుడు సరైన దిశలో ప్రయాణించాల్సిన అవసరం ఉందని, 2047 నాటికి అన్ని అడ్డంకులను అధిగమించి విక్షిత్ భారత్‌గా మారవచ్చని అన్నారు. తాము తీసుకొచ్చిన వోకల్ ఫర్ లోకల్ అనే కాన్సెప్ట్ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేస్తోందని వ్యాఖ్యానించారు మోదీ. దీని కింద దేశంలో ప్రతి జిల్లా కూడా సొంత ఉత్పత్తులపై చేపట్టిందని గుర్తు చేశారు.
వచ్చే అయిదు సంవత్సరాల్లో దేశంలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లను సృష్టించబోతోన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. దీనివల్ల వికసిత్ భారత్.. స్వాస్త్య భారత్‌గా ఆవిర్భవించగలుగుతుందని పేర్కొన్నారు. వైద్య రంగంలో సరికొత్త విప్లవాలకు నాంది పలకబోతోన్నామని తేల్చి చెప్పారు.
దేశంలో అనేక చోట్ల కొత్త మెడికల్ కాలేజీలను నెలకొల్పడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. మున్ముందు మరిన్ని వైద్య కళాశాలలు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. ఆరోగ్య భారత్ వల్లే వికసిత్ భారత్ సాధ్యపడుతుందని మోదీ అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications