ఫోనీ ఎఫెక్ట్ః తక్షణసాయం కింద రూ.1000 కోట్లు
న్యూఢిల్లీః ఫొని తుఫాన్ ప్రభావానికి గురైన రాష్ట్రాలకుల కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు 1000 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఫొని ప్రభావానికి గురైన రాష్ట్రాలకు తక్షణ సహాయక చర్యల కింద 1000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అవసరమైతే ఆర్థిక ప్యాకేజీ మొత్తాన్ని మరింత పెంచుతామని చెప్పారు.
సైక్లోన్ ఫని ఎఫెక్ట్: ఒడిశా అల్లకల్లలోం#CycloneFani #Odisha pic.twitter.com/HpyS8w7s3p
— Oneindia Telugu (@oneindiatelugu) May 3, 2019

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శుక్రవారం ఆయన రాజస్థాన్‌లో పర్యటించారు. హిందౌన్‌లో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ- తుఫాన్ ప్రభావిత రాష్ట్రాలకు గురువారమే ఆర్థిక ప్యాకేజీని విడుదల చేసినట్లు చెప్పారు. దక్షిణాదిన కోస్తా రాష్ట్రాలు పెను తుఫాన్ బారిన పడ్డాయని గుర్తు చేశారు. వారికి అండగా నిల్చోవాల్సిన అవసరం యావత్ దేశానికి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిసైనా ఉందని ఆయన అన్నారు. తుఫాన్ స్థితిగతులపై తాను ఎప్పటికప్పుడు ఆరా తీశానని, ఎలాంటి కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొడానికి సన్నద్ధంగా ఉండాలని తాను అధికారులను ఆదేశించినట్లు మోడీ ఎన్నికల సభలో చెప్పుకొచ్చారు.

బెంగాల్ వైపు ప్రయాణం..
ఇదిలావుండగా- బలహీనపడుతున్న ఫొనీ తుఫాను క్రమంగా తన దిశను మార్చుకుంటోందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోందని పారాదీప్‌లోని రాడార్ నిర్ధారించినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలను వారు విడుదల చేశారు. ఈ ఉదయం 9.30 గంటల సమయంలో ఫోని తుఫాన్ ఒడిశాలోని పూరీ వద్ద తీరాన్ని తాకిన విషయం తెలిసిందే. దీని దెబ్బకు పూరీ, భువనేశ్వర్, కటక్ వంటి నగరాలు, తీర ప్రాంత గ్రామాలు కకావికలం అయ్యాయి. 180 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఫలితంగా- అనేక చోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు వెనువెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications