Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వెంకయ్య నాయుడి ఇంటికి ప్రధాని మోదీ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఢిల్లీలో గల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్రమంత్రులు అక్కడికి వెళ్లారు.

న్యూఢిల్లీ: ఎల్లుండి.. తెలుగు సంవత్సరాది ఉగాది (Ugadi). శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆరంభమౌతుంది. రెండు తెలుగు రాష్ట్రాలు ఈ పండగను వైభవంగా జరుపుకోనున్నాయి. దీనికోసం ఆలయాన్ని ముస్తాబవుతున్నాయి. ఉగాది పంచాంగ శ్రవణాన్ని నిర్వహించడానికి ముందుగానే ఏర్పాట్లు సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అధికారికంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

రెండు రోజుల ముందే..

రెండు రోజుల ముందే..

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడి ఇంట్లో రెండు రోజులు ముందే ఉగాది పండగ కోలాహలం నెలకొంది. ఉగాది మిలన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారాయన. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఇంటిని అలంకరించారు. సంగీతం, నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనలను నిర్వహిస్తోన్నారక్కడ.

ప్రతి సంవత్సరం కూడా వెంకయ్య నాయుడు ఉగాది మిలన్ పేరుతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తూ వస్తోన్నారు. పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తోన్నారు.

ప్రధాని మోదీ సహా..

ప్రధాని మోదీ సహా..

ఈ సాయంత్రం ఢిల్లీలోని వెంకయ్య నాయుడి నివాసంలో ఏర్పాటు చేసిన ఉగాది మిలన్ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ వైస్ ఛైర్మన్ హరివంశ్, పలువురు కేంద్రమంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ప్రధాని మోదీ జ్యోతి ప్రజ్వలన చేసిన ఈ ఉగాది వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

తెలుగు వారికి శుభాకాంక్షలు..

తెలుగు వారికి శుభాకాంక్షలు..

ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొద్దిసేపు మాట్లాడారు. అనేక రాష్ట్రాలు కొత్త సంవత్సరం వేడుకలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడం ఓ ఆనవాయితీగా వస్తోందని, దీన్ని ముందు తరలకూ కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. పండగల వెనుక ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. పశుపక్ష్యాదులను కూడా పూజించడం హిందుత్వలో ఉన్న గొప్పదనమని వ్యాఖ్యానించారు. ప్రతి తెలుగు వారికీ ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తోన్నానని అన్నారు.

తొలిసారిగా..

తొలిసారిగా..

ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడి పదవీ కాలం పూర్తయిన తరువాత ఆయన నివాసానికి ప్రధాని మోదీ వెళ్లడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇంటికి వచ్చిన ఆయనను వెంకయ్య నాయుడు దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఓం బిర్లా, హరివంశ్, సహా పలువురు కేంద్రమంత్రులతో వెంకయ్య నాయుడి నివాసంలో కోలాహలం నెలకొంది. ఈ సందర్భంగా ఆయన నివాసం ఉన్న ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+