యూపీ సీఎంగా యోగి పట్టాభిషేకం : అతిథులుగా ప్రధాని మోదీ, వ్యాపార దిగ్గజాలు, బాలీవుడ్ సెలబ్రిటీలు !!

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందుకు దగ్గ ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా యోగిని ఆపార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లఖ్‌న‌వూలోని ఎకానా స్టేడియంలో సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి దాదాపు 20 వేలమందికిపైగా హాజరవుతారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకు తగ్గట్టుగా బారీగానే ఏర్పాట్లను పూర్తిచేశారు.

యోగి పట్టాభిషేకానికి ముఖ్య అతిథిగా ప్ర‌ధాని మోదీ

ఉత్తరప్రదేశ్‌లో గత 35 ఏళ్లలో వరుసగా రెండు సార్లు ఒక్క రాజకీయ పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. అధికారాన్ని చేప‌ట్ట‌లేదు. ఆ చరిత్రను బీజేపీ తిరగరాసింది. ఈ నేపథ్యంలో యోగి పట్టాభిషేకాన్ని బీజేపీ భారీగా నిర్వహిస్తోంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా రానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్, ఇతరల కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు హాజరుకానున్నారు.

 బాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపార దిగ్గజాలు

బాలీవుడ్ సెలబ్రిటీలు, వ్యాపార దిగ్గజాలు


వారిలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, అనంద్ మహీంద్రా, కుమార మంగళం బిర్లా, ఎన్. చంద్రశేఖరన్, సంజీవ్ గొయెంకా వంటి పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానాలు అందాయి. అటు బాలివుడ్ సినీ ప్రముఖుల్లో అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, బోనీ కపూర్, కంగానా రనౌత్ లు హాజరు కానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. అటు ది కశ్మీర్ ఫైల్స్ చిత్ర బృందం ప్రత్యేక అతిథులుగా యోగి ప్రమాణస్వీకారానికి రానున్నట్లు కమలం నేతలు పేర్కొన్నారు.

మోదీ నాయ‌క‌త్వంపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం

మోదీ నాయ‌క‌త్వంపై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం


బీజేపీ శాసనసభాపక్ష నేతగా యోగిని ఎన్నుకున్న సందర్భంగా కేంద్ర హోం మంత్రి మాట్లాడుతూ.. ప్రధానిగా మోదీ నాయకత్వంపై దేశ ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు మరోసారి బీజేపీకి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. యోగి ప్రభుత్వం గత ఐదేళ్లలో శాంతి భద్రతలను పటిష్టం చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి భద్రత కల్పించిందని చెప్పారు. ప్రభుత్వ పథాకాల అమలులో కులాలు, మతాలు చూడడంలేదని స్పష్టం చేశారు.

క‌లిసిక‌ట్టుగా ప‌నిచేద్దాం..

క‌లిసిక‌ట్టుగా ప‌నిచేద్దాం..

అటు యోగి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ మద్దతులో గత ఐదేళ్లలో యపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా చేశామన్నారు. రాష్ట్రంలో అల్లర్లు లేకుండా చేశామ‌ని చెప్పారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు.. ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. ప్రధాని మోదీ, ప్రజల సహకారంతో కలిసికట్టుగా పనిచేద్దామన్నారు. మరోసారి బీజేపీకి అధికారం అప్పజెప్పినందుకు ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. సీఎంగా రెండో సారి అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి, అమిత్ షాకు, బీజేపీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+