బ్రిటన్ టూర్ క్యాన్సిల్.. కారణమిదే,
భారత్ లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కేసులు పెరుగుదలే కానీ తగ్గడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా సంక్షోభం నెలకొని ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. జూన్‌లో బ్రిటన్ లోని కార్న్ వాల్ లో జి-7 దేశాల సదస్సు జరగనుండగా, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత ప్రధాని మోదీని ప్రత్యేకంగా ఆహ్వానించారు.
సదస్సు జూన్ 11 నుంచి 13వ తేదీ వరకు జరగనుంది. బ్రిటీష్ ప్రధాని ప్రత్యేకంగా ఆహ్వానించడం సంతోషదాయకమే అయినా, భారత్ లో కరోనా ప్రబలంగా ఉన్న దశలో జి-7 దేశాల సమావేశానికి మోదీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. భారత్ లో కరోనా సంక్షోభ నివారణకే ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు.

జి-7 దేశాల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల అధినేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి భారత్ తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా దేశాధినేతలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. కానీ కరోనా వైరస్ విలయ తాండవం చేస్తుండటంతో ప్రధాని మోడీ టూర్ రద్దు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications