సౌదీ పర్యటనను రద్దు చేసుకున్న ప్రధాని.. హుటాహుటిన ఇండియాకు పయనం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని హఠాత్తుగా భారతదేశానికి తిరుగు పయనమయ్యారని సమాచారం అందుతుంది. వాస్తవానికి , మోదీ సౌదీ అరేబియాలో కీలకమైన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనాల్సి ఉంది. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు వంటి అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, ఊహించని విధంగా ఆయన తన పర్యటనను రద్దు చేసుకుని, రాత్రికి రాత్రే భారతదేశానికి బయలుదేరారు. పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే.ఈ దాడిలో 27 మంది మరణించారు.ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు.

ఈ దాడిని అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఈ దాడి మానవత్వానికే మాయని మచ్చ అని ఆయన అన్నారు.అమాయక ప్రజల ప్రాణాలను బలిగొనే ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాద దాడి జరగడంతో ఆయన సౌదీ అరేబియా పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని స్వదేశానికి పయనమయ్యారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications