వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థర్డ్ వేవ్.. వ్యాక్సినేషన్.. ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా వైరస్ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. ఇటు థర్డ్ వేవ్ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలోనే వస్తోందని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై చర్చించారు. సెకండ్ వేవ్ తగ్గిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి చెప్పిన మరుసటి రోజే ప్రధాని సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది

ఇటు కేరళ, మహారాష్ట్రలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశంలో రికవరీ రేట్ 97.49% ఉండటాన్ని అధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 72 కోట్లకు పైగా వ్యాక్సిన్లు వేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. దేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారిలో 50% మంది ఫస్ట్ డోస్, 18% మంది సెకండ్ డోస్ కూడా తీసుకున్నారని వివరించారు. 12 సంవత్సరాలు పైబడిన వారికి ఈ నెల 15 నుంచి జైకోవ్ డీ వ్యాక్సిన్లు వేయనుండటంతో ఏర్పాట్లను కూడా మోదీ అడిగి తెలుసుకున్నారు.

PM Modi chairs high-level Covid review meet

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించి.. శాని టైజర్ రాసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.

English summary
Prime Minister Narendra Modi on Friday chaired a high-level meeting to review the Covid-19 situation as experts warned of a possible third coronavirus wave in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X