అందుకే కర్నాటక సీఎం, డిప్యూటీల్ని రావొద్దన్నా ! ప్రధాని మోడీ క్లారిటీ..

ప్రధాని మోడీ చంద్రయాన్ 3 విజయంపై ఇస్రో శాస్త్రవేత్తల్ని అభినందించేందుకు బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా బెంగళూరు ఎయిర్ పోర్టులో ప్రోటోకాల్ ప్రకారం ప్రధానిని ఆహ్వానించేందుకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లు వెళ్లాల్సి ఉంది. కానీ వారు వెళ్లలేదు. దీంతో ఏం జరిగిందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత తమను ఎయిర్ పోర్టుకు రావొద్దన్నారని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చారు.

అయితే ప్రధాని మోడీ ప్రోటోకాల్ ప్రకారం రావాల్సిన కర్నాటక సీఎంను ఎయిర్ పోర్టుకు ఎందుకు రావొద్దన్నారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ కు ఈ వ్యవహారం కారణమైంది. సోషల్ మీడియాలోనూ దీనిపై వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు ఇస్రో కేంద్రానికి వచ్చి శాస్త్రవేత్తల్ని అభినందించిన ప్రధాని మోడీ ఈ ప్రోటోకాల్ వివాదంపైనా స్పందించారు. తాను కర్నాటక సీఎం, డిప్యూటీ సీఎం, గవర్నర్లను ఎయిర్ పోర్టుకు రావొద్దని చెప్పడానికి వెనుక గల కారణాన్ని వెల్లడించారు.

pm modi clarified why he restricts karnataka cm from welcoming him at airport

కర్నాటకకు వచ్చి ప్రోటోకాల్ ప్రకారం సీఎం, డిప్యూటీ సీఎం ఆహ్వనం పలికేందుకు రావొద్దని చెప్పాల్సి రావడం వెనుక కారణాన్ని ప్రధాని మోడీ బయటపెట్టారు. బెంగుళూరుకు ఎప్పుడు చేరుకుంటారో తనకు తెలియదని, కాబట్టి అంత తొందరగా సీఎం, డిప్యూటీ సీఎం, గవర్నర్ ను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. బెంగళూరులోని హెచ్‌ఏఎల్ విమానాశ్రయం వెలుపల ప్రజలను ఉద్దేశించి శనివారం మాట్లాడుతూ.. తాను బెంగళూరుకు ఎప్పుడు చేరుకుంటానో తెలియదు కాబట్టి, ఇంత త్వరగా (నన్ను ఆహ్వానింంచడానికి) ఇబ్బంది పడవద్దని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు గవర్నర్‌ని అభ్యర్థించానని ప్రధాని మోదీ అన్నారు.

ఈ ఉదయం బెంగళూరు చేరుకున్న తర్వాత విమానాశ్రయం వెలుపల ఉన్న ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తాను శాస్త్రవేత్తలతో సమావేశమైన తర్వాత బయలుదేరుతాను కాబట్టి వారు రావద్దని నేనే ముఖ్యమంత్రి, గవర్నర్‌కు చెప్పానని ప్రధాని తెలిపారు. తాను బెంగుళూరుకు ఎప్పుడు చేరుకుంటానో నాకు తెలియదు కాబట్టి ప్రోటోకాల్ పాటించకుండా ఉండమని తానే వారిని అడిగానన్నారు. ఈ వివాదంపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ.. ప్రధానిని ఆహ్వానించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి తనకు అధికారిక సమాచారం వచ్చినందున దానిని గౌరవించాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+