ములాయంతో దిగిన పాత ఫొటోలను షేర్ చేసిన మోదీ: ఆసుపత్రికెళ్లిన షా: జగన్, కేసీఆర్ సహా..!!

లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యాహ్నం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వెంటనే ఆయనను ఐసీయూకు తరలించారు. ఆయన ప్రాణాలను నిలపడానికి డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించారు. అత్యాధునిక వైద్య సేవలను అందించారు. అయినప్పటికీ- ఫలితం రాలేదు.

 ఐసీయూలో..

ఐసీయూలో..

శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు ములాయం సింగ్ యాదవ్. దీన్ని గమనించిన డాక్టర్లు హుటాహుటిన ఐసీయూ నంబర్ 5కు తరలించారు. ఆంకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ నితిన్ సూద్, డాక్టర్ సుశీల కఠారియా పర్యవేక్షణలో చికిత్స అందించారు. ములాయం సింగ్ యాదవ్‌ను ఐసీయూలోకి తరలించినట్లు సమాచారం అందిన వెంటనే కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్‌, తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్.. హుటాహుటిన మేదాంత ఆసుపత్రికి చేరుకున్నారు.

మూడుసార్లు ముఖ్యమంత్రిగా..

మూడుసార్లు ముఖ్యమంత్రిగా..

ములాయం సింగ్ యాదవ్‌కు ఇద్దరు భార్యలు. వారిద్దరూ మరణించారు. 2003లో ఆయన మొదటి భార్య మాలతీ దేవి కన్నుమూశారు. ఆ తరువాత సాధన గుప్తాను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జులైలో ఆమె తుదిశ్వాస విడిచారు. కాలేయ వ్యాధితో బాధపడిన సాధన గుప్తా ఇదే మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కాగా- దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌కు మూడుసార్లు ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రిగా పని చేశారు.

అనారోగ్యంతో..

అనారోగ్యంతో..

1989, 1993, 2003లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించారు. కేంద్రమంత్రిగా వేర్వేరు శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. కుమారుడు అఖిలేష్ యాదవ్ పూర్తిస్థాయిలో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత.. ఆయన దూరం అయ్యారు. అదే సమయంలో వయస్సు మీద పడటం, అనారోగ్యం చుట్టుముట్టడంతో పూర్తిస్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.

 సంతాపాలు..

సంతాపాలు..

ములాయం మృతిపట్ల దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. ములాయం సింగ్ యాదవ్‌తో వేర్వేరు సందర్భాల్లో కలిసి దిగిన కొన్ని పాత ఫొటోలనను ప్రధాని మోదీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే అమిత్ షా.. గుర్‌గావ్ మేదాంత ఆసుపత్రికి వెళ్లారు.

సోషలిస్ట్ నేతగా..

సోషలిస్ట్ నేతగా..

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్‌, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా, స్వాతంత్ర్య సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి నేతల స్ఫూర్తితో ములాయం సింగ్ రాజకీయాల్లోకి వచ్చారని పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి మూడుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పని చేశారని కేసీఆర్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+