RRR GOLDEN GLOBE AWARD: RRR టీంకు పీఎం మోడీ అభినందనలు..

RRR చిత్రంలోని 'నాటునాటు' పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఉత్తమ పాటగా ప్రఖ్యాత గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ను పీఎం మోడీ అభినందిస్తూ ట్వీట్ చేశారు. "చాలా ప్రత్యేకమైన అవార్డు! ఎంఎం కీరవాణి, ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, చంద్రబోస్, రాహుల్సిప్లిగంజ్ కు అభినందనలు. ఎస్ఎస్ రాజమౌళి, తారక్, రామ్ చరణ్, RRR మొత్తం బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ప్రతి భారతీయుడిని ఎంతో గర్వించేలా చేసింది" అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

రాజమౌళి

ఆస్కార్ తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకమైనవిగా చెప్పుకునే గోల్డెన్ గ్లోబ్ 80వ అవార్డుల కార్యక్రమం కాలిఫోర్నియాలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఇందులో RRR (రౌద్రం రణం రుధిరం) బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ నాన్ ఇంగ్లీష్ మూవీ విభాగాల్లో నామినేట్ కాగా.. నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చింది. దీనికోసం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి తమ ఫ్యామిలీలతో అక్కడకు చేరారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ఈ పాటు అవార్డు రావడంపై ప్రముఖులు RRR మూవీ టీంకు అభినందనలు చెబుతున్నారు. నాటు నాటు సాంగ్‌తో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది. యావత్‌ రాష్ట్రం తరపున.. కీరవాణి, రాజమౌళి, జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మొత్తం ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకు అభినందలు తెలియజేస్తున్నా. మిమ్మల్ని చూసి మేం చాలా గర్వపడుతున్నాము అంటూ ట్వీట్‌ చేశారు.

రాహుల్ సిప్లిగంజ్‌

నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌ఆనందం వ్యక్తం చేశారు. తాను ఎప్పుడు గల్లీబాయ్‌గా పోల్చుకుంటా. కానీ ఇప్పుడు ఈ గల్లీబాయ్‌ పేరు అంతర్జాతీయ స్టేజ్‌పై వినిపించిందన్నారు. స్టేజ్‌పై కీరవాణి గారు నా పేరు చెప్పడం గర్వంగా అనిపిస్తుందని రాహుల్ చెప్పాడు. నాటు నాటు పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాల భైరవ పాడాగా.. ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు. కీరవాణి సంగీతం అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+