మోదీ సాబ్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు!!

మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగి రెండు సంవత్సరాలకు పైగా గడిచిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో అడుగు పెట్టారు. ఈ అల్లర్లల్లో తీవ్రంగా నష్టపోయిన చురాచాంద్‌పూర్‌కు చేరుకున్నారు. అక్కడ నిరాశ్రయులతో కలిశారు. వారిని ఆప్యాయంగా పలకరించారు. వారికి అందుతున్న పథకాలు, ఇతర లబ్ది గురించి అడిగి తెలుసుకున్నారు. నరమేధానికి కేంద్రబిందువుగా నిలిచిన ప్రాంతం ఇది. ఈ చురాచాంద్‌పూర్‌ 260 మంది ప్రాణాలు కోల్పోయారు అప్పట్లో.

ఇక్కడికి చేరుకోవడానికి ప్రధాని మోదీ 65 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. నిజానికి ఆయన ప్రత్యేక విమానంలో ఇంఫాల్ విమానాశ్రయం నుండి చురాచాంద్ పూర్ కు రావాల్సి ఉన్నప్పటికీ.. భారీ వర్షం అడ్డంకిగా నిలిచింది. దీంతో 65 కిలో మీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి ఈ ప్రాంతానికి చేరుకున్నారు. ఫలితంగా ఆయన పర్యటన షెడ్యూల్ లో స్వల్పంగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి.

PM Modi Connects with Manipur Violence Victims Amid Ongoing Unrest

చురాచాంద్‌పూర్‌లోని పీస్ గ్రౌండ్ రిలీఫ్ క్యాంపుల్లో నిరాశ్రయులను మోదీ కలుసుకున్నారు. వారితో ముచ్చటించారు. యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తోన్న సౌకర్యాలు, ఇతరత్రా అంశాలపై ఆరా తీశారు. ఈ పర్యటనలో మోదీ వెంట గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఉన్నారు. పీస్ గ్రౌండ్ కు చేరుకున్న ప్రధానిని ప్రజలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా నిలిచి ఆయనపై పూలవర్షాన్ని కురిపించారు.

దీని తర్వాత పీస్ గ్రౌండ్ లోనే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు ప్రధాని మోదీ. అలాగే- మొత్తం 7,300 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మణిపూర్ పట్టణ రహదారులు, డ్రైనేజీ, ఆస్తి నిర్వహణ పనులు ఉన్నాయి. అంతకుముందు ఆయన మిజోరాంలో పర్యటించారు. అక్కడ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం నేరుగా ఇంఫాల్ కు చేరుకున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్లాకు చేరుకుంటారు. అక్కడ కూడా బాధిత కుటుంబాలవారిని పరామర్శిస్తారు. అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. 2023లో హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోయిన తర్వాత ప్రధాని మోదీ మణిపూర్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని, దీనిపై మాట్లాడటానికి ఆయన ఎందుకు సంశియిస్తోన్నారంటూ గతంలో పలుమార్లు ప్రతిపక్ష పార్టీల నాయకులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+