బోర్డర్ లో టెన్షన్ టెన్షన్.. ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం దిశగా..!
పాకిస్థాన్ వరుసగా మూడో రోజూ డ్రోన్ దాడులు చేపట్టింది. జమ్మూ, శ్రీనగర్ పరిధిలోని ప్రాంతాల్లో భారీగా దాడులకు పాల్పడుతోంది. మరోవైపు వీటిని భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. దీంతో ఇరు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర భేటీ నిర్వహించారు. విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో తన నివాసంలో ప్రధాని మోదీ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ తో పాటు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీడీఎస్ అనిల్ చౌహాన్, విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్ సహా తివిధ దళాల అధిపతులు హజరయ్యారు. ఇక ఈ భేటీకి ముందు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. సరిహద్దుల్లో, విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. పలు సూచనలు చేశారు.

మరోవైపు పాకిస్థాన్ మూడో రోజూ దాడులకు తెగబడింది. జమ్మూ, సాంబా, పఠాన్‌కోట్ లక్ష్యంగా డ్రోన్ దాడులతో విరుచుకుపడుతోంది. అమృత్‌సర్, ఫిరోజ్‌పుర్, హోషియార్ పుర్, గురుదాస్ పుర్, తర్న్ తరణ్ ప్రాంతాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
PM @narendramodi chaired a meeting, which was attended by Defence Minister @rajnathsingh, NSA Ajit Doval, CDS General Anil Chauhan, Chiefs of the armed forces and senior officials. pic.twitter.com/ciFWz8osRK
— PMO India (@PMOIndia) May 9, 2025
జమ్మూ నగరంలో తనకూ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా తెలిపారు. ప్రజలు వీధుల్లోకి రావొద్దని, ఇళ్లలోనే ఉండాలని ఒమర్ అబ్దుల్లా సూచించారు. ఇక తాజాగా కాశ్మీర్ లోని అవంతిపురా వైమానిక స్థావరంపై పాకిస్థాన్ దాడులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పాక్ డ్రోన్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications