రికార్డుల రారాజు "మోడీ": చామ్లింగ్‌ను దాటేసి సుదీర్ఘకాలం పాలించిన నేతగా రికార్డు !!

భారత రాజకీయ చరిత్రలో అరుదైన మైలురాయిని అధిగమిస్తూ ప్రధాని Narendra Modi సరికొత్త రికార్డు సృష్టించారు. ఆదివారం, మార్చి 22, 2026 నాటితో దేశ ప్రభుత్వాధిపతిగా అత్యధిక కాలం పనిచేసిన నాయకుడిగా నిలిచారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం నుంచి ప్రధానిగా కొనసాగుతూ మొత్తం 8,931 రోజులపాటు అధికారంలో కొనసాగడం విశేషం. ఈ క్రమంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి Pawan Kumar Chamling పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును అధిగమించారు.

సుదీర్ఘ ప్రజాసేవకు ప్రతీక..

ఈ రికార్డు కేవలం సంఖ్య మాత్రమే కాదు... దశాబ్దాలపాటు నిరంతర ప్రజాసేవ, నాయకత్వానికి నిదర్శనమని బీజేపీ నేతలు కొనియాడుతున్నారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఎక్కువకాలం పనిచేసిన అనుభవంతో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అరుదైన నాయకుడిగా కూడా మోడీ గుర్తింపు పొందారు.

pm-modi-create-record-as-longest-serving-prime-minister-for-india-by-crossing-sikkim-ex-cm-pavan-kum

మోడీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో ఉంది. భూకంపం, కరువు, తుఫానులు, రాజకీయ అస్థిరత వంటి సమస్యలు రాష్ట్రాన్ని దెబ్బతీశాయి. అయితే ఈ సవాళ్లను అవకాశాలుగా మార్చుకుని అభివృద్ధి దిశగా నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల రంగాల్లో గుజరాత్‌ను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లారు.

ప్రధానిగా మూడు సార్లు..

Bharatiya Janata Party నాయకత్వంలో మోదీ 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు విజయం సాధించారు. స్వాతంత్య్రం తర్వాత జన్మించిన తొలి ప్రధాని కూడా ఆయనే కావడం ప్రత్యేకత. ప్రజల విశ్వాసం, బలమైన నాయకత్వం ఆయన విజయాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

పాలనలో కీలక మార్పులు..

తన హయాంలో దేశవ్యాప్తంగా పలు కీలక పథకాలు అమలు చేశారు. 'నారీశక్తి', 'యువశక్తి', రైతుల సంక్షేమం, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్-అప్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశాయి. గత దశాబ్దంలో కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రభుత్వం పేర్కొంటోంది.

తన తల్లి ఇచ్చిన విలువలు తన రాజకీయ జీవితానికి మార్గదర్శకమయ్యాయని మోదీ తరచూ పేర్కొంటారు. పేదల కోసం పని చేయడం, అవినీతి దూరంగా ఉంచుకోవడం వంటి సూత్రాలు ఆయన పాలనలో ప్రతిఫలిస్తున్నాయని అంటున్నారు. ప్రజాసేవను అత్యున్నత కర్తవ్యంగా భావిస్తున్నానని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు.

గ్లోబల్ స్థాయిలో భారత్ ఎదుగుదల..

మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానాన్ని సంపాదించింది. అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ట పెరిగింది. విదేశీ పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో పురోగతి దేశాన్ని "వికసిత భారత్" లక్ష్యానికి దగ్గర చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక "వికసిత్ భారత్" లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని మోడీ స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడుతూ, సమగ్ర అభివృద్ధి సాధించడం తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేశ ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో మరింత సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+