రికార్డ్ బ్రేక్ చేసిన ప్రధాని మోదీ..!!
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత రికార్డులను బ్రేక్ చేశారు. ఓ సరికొత్త రికార్డును సృష్టించారు. దీన్ని ఇప్పట్లో ఎవరూ చెరిపేయలేరు. దారిదాపుల్లోనూ ఎవరూ లేరు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, దుబాయ్ కింగ్ షేక్ మహ్మద్, పోప్ ఫ్రాన్సిస్‌నూ దాటేశారు.
ఆ రికార్డే- ఎక్స్ అకౌంట్‌లో ఫాలోవర్ల సంఖ్య. ఎక్స్ అకౌంట్‌లో మోదీని ఫాలో అవుతున్న వారి సంఖ్య 100 మిలియన్లు.. అంటే 10 కోట్లను అధిగమించింది. ఈ స్థాయిలో ఫాలోవర్లు ఉన్న దేశాధ్యక్షుడు గానీ, ప్రధానమంత్రి గానీ మరొకరు లేరు. గతంలో కూడా 100 మిలియన్లను అందుకున్న వారు మరెవరూ లేరు కూడా.

ప్రత్యేకించి- మూడు సంవత్సరాల వ్యవధిలో ఈ ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2021 నాటికి ఈ సంఖ్య 30 మిలియన్లుగా ఉండేది. తాజాగా ఇప్పుడది 100 మిలియన్లను అధిగమించింది. జాతీయ, అంతర్జాతీయంగా దీనితో పోటీ పడే మరో లీడర్ లేడు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ అకౌంట్‌ను ఫాలో అవుతున్న వారు 26.40 మిలియన్ల మంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్- 27.5, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్- 19.9, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ- 7.4, లాలూ ప్రసాద్ యాదవ్- 6.3, తేజస్వి యాదవ్- 5.2, శరద్ పవార్- 2.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
A hundred million on @X!
— Narendra Modi (@narendramodi) July 14, 2024
Happy to be on this vibrant medium and cherish the discussion, debate, insights, people’s blessings, constructive criticism and more.
Looking forward to an equally engaging time in the future as well. pic.twitter.com/Gcl16wsSM5
అంతర్జాతీయ స్థాయిలో చూసుకుంటే.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్- 38.1, దుబాయ్ కింగ్ షేక్ మహ్మద్- 11.2, పోప్ ఫ్రాన్సిస్- 18.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఒక్క స్పోర్ట్స్ కేటగిరీలో కూడా మోదీని కొట్టేవారే లేరు. విరాట్ కోహ్లీ- 64.1, బ్రెజిలియన్ ఫుట్‌బాల్ స్టార్ నెయ్‌మార్ జూనియర్- 63.6, అమెరికన్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్- 52.9 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.












Click it and Unblock the Notifications