TMC పాలనకు ఇక ఫేర్ వెల్: ప్రధాని మోదీ
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. 15 ఏళ్లపాటు బెంగాల్ లో ఉన్న మహాజంగిల్ రాజ్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. టీఎంసీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని.. మమతా బెనర్జీ, ఆమె పార్టీని అధికారం నుంచి తొలగించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. హూగ్లీ జిల్లా సింగూర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
టీఎంసీ ప్రభుత్వం రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులు, మత్స్య కారులకు శత్రువుగా మారిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కేవలం భారతీయ జనతా పార్టీ(బీజేపీ) మాత్రమే బెంగాల్ లో అభివృద్ధిని తీసుకొస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా టీఎంసీ ప్రభుత్వం అడ్డుపడుతోందని ప్రధాని మోదీ తెలిపారు. " ఇక్కడకు నా తల్లులు, చెల్లెమ్మలు, రైతులు అందరూ వచ్చారు. అందరూ ఒకటే ఆశతో వచ్చారు. మార్పు కోరుకుంటున్నారు. 15 ఏళ్లపాటు సాగిన మెగా జంగిల్ రాజ్ కు చరమగీతం పాడాలని అందరికీ ఉంది. ఇప్పటికే బిహార్ లో జంగిల్ రాజ్ ను బీజేపీ ఆపేసింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లోనూ బీజేపీ కి ఫేర్ వెల్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అవుతోంది" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అప్పట్లో దిల్లీలో ఓ ప్రభుత్వం(అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ) ఉండేదని ఆ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసింది. కానీ ఆ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు దిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. మరి బెంగాల్ లోనూ టీఎంసీ ప్రభుత్వాన్ని శిక్షించి ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ను ఏర్పాటు చేసుకుందామా..? అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకే బెంగాలీ భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అందించామని.. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలోని యూపీఏ ప్రభుత్వం ఆ పని చేయలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అలాగే దుర్గా పూజకు యూనెస్కో స్టేటస్ కూడా తమ ప్రభుత్వ కృషి వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు. బెంగాల్ అభివృద్ధి చెందేందుకు అన్ని రకాల ప్రకృతి వనరులు ఉన్నాయని .. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఏదో ఒక ప్రత్యేకత ఉందని స్పష్టం చేశారు. బెంగాల్ లో బీజేపీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.












Click it and Unblock the Notifications