దీపావళి వేళ.. ప్రధాని మోదీ వీడియో సందేశం
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వెలుగుల పండుగ వేళ దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం మిన్నంటిందని పేర్కొన్నారు. ఈ పండగ కాంతులు.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ నూతన ఉత్సాహాన్ని, సుఖసంతోషాలను నింపాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎక్స్ లో ప్రధాని మోదీ ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీపావళి విశిష్టతను వివరించారు. ఈ పవిత్ర దీపావళి పర్వదినాన దేశమంతా నూతన కాంతులతో ప్రకాశిస్తోందని పేర్కొన్నారు. చీకటిపై వెలుగు సాధించే విజయానికి పండుగ ఓ చిరస్మరణీయ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ఇంటా వెలుగులు నిండాలని, సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

ఏటా దీపావళి పండుగ రోజున దేశ సరిహద్దుల్లో సైనికులతో గడపడం ప్రధాని మోదీ ఆనవాయితీ. ఈ ఆనవాయితీని ఈ ఏడాది కూడా కొనసాగించనున్నారు. సరిహద్దు భద్రతా బలగాల మధ్య దీపావళి పండుగ వేడుకలు జరుపుకోనున్నట్లు తెలిపారు. ఏ ప్రాంత సరిహద్దులకు వెళ్తారనేది వెల్లడించలేదు. అధికారికంగా ఈ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఆదివారం ఉదయం ఆయన దేశ సరిహద్దులకు బయలుదేరి వెళ్లనున్నారు.
మంచు కొండలు, ఎడారి ప్రాంతాలలో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ దేశాన్ని రక్షిస్తున్న వీర జవాన్ల త్యాగాలు, సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. మోదీతో పాటు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ధర్మం, న్యాయం, సత్యం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ సమాజంలో శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు.
Have a great Diwali! https://t.co/YbFVq7tHmx
— Narendra Modi (@narendramodi) November 7, 2026
మరోవంక.. దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని తాకుతోన్నాయి. ప్రతి ఇల్లూ మట్టి ప్రమిదల వెలుగులు, విద్యుత్ కాంతులతో శోభాయమానంగా ముస్తాబైంది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆలయాలు దీపావళి సందర్భంగా విద్యుత్ దీపాలతో దివ్యంగా ప్రకాశిస్తోన్నాయి. అయోధ్య రామాలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తోన్నారు. చీకటిని పారద్రోలి వెలుగులను నింపే ఈ దీపావళి పండుగ, భారతదేశ సాంస్కృతిక వైభవానికి, సమగ్రతకు ప్రతీకగా నిలుస్తోంది.













Click it and Unblock the Notifications
