మాల్దీవులకు రూ.4,850 కోట్ల రుణం ప్రకటించిన ప్రధాని మోదీ.. భారత్ కు నిజమైన ఫ్రెండ్ అని ప్రశంసలు..
భారత్, మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక చర్చలు జులై 24న జరిగాయి. మాల్దీవుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఈ చర్చల్లో హాజరయ్యారు. ఈ ఏడాది ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు 60 వ వసంతంలోకి అడుగుపెట్టాయి. ఈ మేరకు మాల్దీవులు, భారత్ మధ్య ఉన్న స్నేహాన్ని పునరుద్ఘాటించారు. ఈ మేరకు మాల్దీవ్స్ కు రూ.4,850 కోట్ల రుణం ప్రకటించారు. ఆ దేశం మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ కు మాల్దీవులు నిజమైన స్నేహితుడు అని స్పష్టం చేశారు.
" ఈ ఏడాది భారత్, మాల్దీవులు 60వ వసంతంలోకి అడుగుపెట్టాయి. 60 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. కానీ అంతకుముందు నుంచే ఇరు దేశాల మధ్య సముద్రమంత లోతైన అవగాహన కలిగి ఉంది. ఇరు దేశాల మధ్య మ్యారిటైమ్ సంబంధాలు బలోపేతం అయ్యాయి. ఇది మనం కేవలం సరిహద్దు దేశాలమే కాదు. కో- ప్యాసింజర్స్ అని తెలియజేస్తుంది. భారత్.. మాల్దీవ్స్ కు అత్యంత సరిహద్దు దేశం. భారత్.. నైబర్ హుడ్ పాలసీలో మాల్దీవ్స్ కీలక పాత్ర పోషిస్తుంది. మాల్దీవులు మా స్నేహితుడైనందుకు మేము గర్విస్తున్నాం. కొవిడ్ సమయంలోనూ.. సంక్షోభంలోనూ ఆ దేశానికి మొదట అండగా ఉంది భారత్ మాత్రమే. కొవిడ్-19 తర్వాత భారత్, మాల్దీవులు మరింత కలిసి పనిచేశాయి" అని ప్రధాని మోదీ తెలిపారు. అంతేకాక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చునేందుకు నిర్ణయానికి వచ్చామని తెలిపారు.
Glimpses from the ceremonial welcome at Republic Square in Malé…@MMuizzu pic.twitter.com/2MAaT1PXxB
— Narendra Modi (@narendramodi) July 25, 2025
అనంతరం మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మాట్రాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తమ దేశానికి రావడం ఎంతో ప్రాముఖ్యతను చాటుకుందని తెలిపారు. భారత్ తో నాలుగు ఎంఓయూలపై సంతకాలు జరిపినట్లు పేర్కొన్నారు. భారత్ మాల్దీవులకు రూ.4,850 కోట్ల రుణం ప్రకటించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

బ్రిటన్ పర్యటన అనంతరం మాల్దీవులుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి మాలె విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు స్వయంగా విమానాశ్రయానికి వచ్చి, మోదీకి స్వాగతం పలికారు. అయితే రెండు రోజుల పర్యటనలో భాగంగా జులై 26న మాల్దీవులు స్వాతంత్ర్య దినోత్సవంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా భారత్ సహకారంతో నిర్మించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications