దేశం కోసం అవిశ్రాంత శ్రామికుడు.. ఒక్కరోజూ సెలవు పెట్టని మోదీ

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి నాయకత్వాన్ని వహిస్తోన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకూ ఏ ప్రధాని కూడా దీన్ని అందుకోలేదు. ఒక్కరోజు కూడా సెలవు పెట్టని ప్రధానిగా రికార్డు సృష్టించారు.

2014 మే 26వ తేదీన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు. నిరంతరం పని చేస్తూనే వస్తోన్నారు. రోజువారీ సమీక్షల్లో పాల్గొంటూనే ఉన్నారు. అధికారిక కార్యక్రమాల్లో భాగస్వామి అవుతూనే ఉన్నారు.

PM Modi has not taken a single leave since assuming PMO in 2014

తొలి విడత అయిదు సంవత్సరాల్లో మోదీ అనేక దేశాల్లో పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని హోదాలో పలు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం మొదలుకుని అమెరికన్ కాంగ్రెస్ జాయింట్ సెషన్స్‌నూ ఉద్దేశించి ప్రసంగించారు. భారత ప్రధాని అడుగుపెట్టని మంగోలియా వంటి దేశాలనూ సందర్శించారు.

2019 తరువాత కూడా ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా రోజువారీ అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటోన్నారు మోదీ. చివరికి తల్లి హీరాబెన్ కన్నుమూసిన రోజూ ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. 2022 డిసెంబర్ 30వ తేదీన హీరాబెన్ తుదిశ్వాస విడిచారు.

అహ్మదాబాద్‌లో తల్లి పార్థివ దేహానికి అంత్యక్రియలను నిర్వహించిన అనంతరం మోదీ వర్చువల్ విధానంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో ప్రతిరోజూ సమీక్ష సమావేశాల్లో పాల్గొన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

PM Modi has not taken a single leave since assuming PMO in 2014

మోదీ ఎన్ని రోజులు సెలవు పెట్టారంటూ సమాచార హక్కు చట్టం కార్యకర్త ఒకరు ప్రధానమంత్రి కార్యాలయానికి దరఖాస్తు చేసుకోగా.. అధికారులు ఈ మేరకు దీనికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు. ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదని, పూర్తి వివరాలు http://pmindia.gov.in వెబ్‌సైట్‌లో పొందుపరిచామని సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతం మోదీ.. జీ20 శిఖరాగ్ర సదస్సు ఏర్పాట్లల్లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నెల 9, 10 తేదీల్లో ఢిల్లీలో ఈ సదస్సు జరుగనుంది. జీ20 సభ్యదేశాల అధినేతలు, ప్రధానమంత్రులు ఈ భేటీకి హాజరు కానున్నారు. ఇందులో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ రానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+