PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో మైసూరు రాజవంశస్తులు బ్రేక్ ఫాస్ట్, మెనూలో ఏం ఉందంటే, మైసూర్ పాక్ !
బెంగళూరు/ మైసూరు: ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కర్ణాటకలోని రాచనగరి మైసూరులో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గోన్నారు. యోగాతో ఏకాగ్రత, క్రమశిక్షణ అలవడుతుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రతిరోజు మనం కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తోంది. యోగా శాంతికి, ఆరోగ్యం, సంతోషానికి సూచిక అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ మైసూరు పర్యటన సందర్బంగా ఆయనకు ప్రత్యేక వంటకాలు తయారు చేయిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మోను సిద్దం చేసిన అధికారులు వాటిని ఆయనకు వడ్డించడానికి సిద్దం అయ్యారు. మైసూరు రాజవంశస్తులతో ప్రధాని నరేంద్ర మోదీ బ్రేక్ ఫాస్ట్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

మైసూరులో ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కర్ణాటకలోని రాచనగరి మైసూరులో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గోన్నారు. యోగా వలన మనకు ఎంతో లాభం ఉందని, యోగా చెయ్యడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుందని, జీవితంలో మనం చాలా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

ప్రపంచ దేశాలకు ధన్యవాదాలు: మోదీ
యోగా చెయ్యడం వలన మనకు అనేక లాభాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. యోగాను గుర్తించిన ఐక్యరాజసమితి సహా ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు యోగాసనాలు వేసిన విద్యార్థులు, స్థానిక ప్రజలు చాలా ఉత్సాహంగా కనిపించారు.

మోదీ కోసం శాఖాహార వంటకాలు
ప్రధాని నరేంద్ర మోదీ కోసం మైసూరులో పూర్తి శాఖాహారం వంటకాలు సిద్దం చేశారు. ఉదయం అవలక్కి (అటుకులు), ఉప్మా, ఇడ్లీ-సాంబార్, బ్రెడ్ బటర్, మిక్స్ ఫ్రూట్స్ సిద్దం చేశారు. మద్యాహ్నం మైసూరు శైలీలో విజిటబుల్ సూప్, మసాలా మజ్జిగ, రోటి, జీరా రైస్, దాల్, మిక్స్ ఫ్రూట్స్ సిద్దం చేశారు. మోదీకి తయారు చేయించిన వంటకాలలో చక్కర, మసాలాలు తక్కువగా వాడుతున్నారని సమాచారం.

మైసూరు రాజవంశస్తులతో మోదీ బ్రేక్ ఫాస్ట్
ప్రధాని మోదీ కోసం రాత్రి ఓ మెనూ కూడా సిద్దం చేశారు. కిచడి, గుజరాతి శైలిలో కర్రీ, రోటి, దాల్, రైస్, రెండు రకాల సబ్జి, మసాలా మజ్జిగ, మిక్స్ ఫ్రూట్ సిద్దం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మోను సిద్దం చేసిన అధికారులు వాటిని ఆయనకు వడ్డించడానికి సిద్దం అయ్యారు. మైసూరు రాజవంశస్తులతో ప్రధాని నరేంద్ర మోదీ బ్రేక్ ఫాస్ట్ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.

మైసూరు పాక్ అనే పేరు ఎవరు పెట్టారంటే ?
మైసూరు రాజవంశస్తులు అరసర కాలంలో కాకాసుర మాదప్ప అనే ఆయన ఓ తియ్యటి రుచికరమైన వంటకం చేసి పెట్టారు. ఆ స్వీట్ తినిన అప్పటి మైసూరు మహారాజు కృష్ణరాజ ఒడయార్ దానికి మైసూరు పాక్ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి మైసూర్ పాక్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కాకాసుర మాదప్ప కుటుంబ సభ్యులు మైసూరు పాక్ స్వీట్ తయారు చేస్తున్నారు.

మోదీ కోసం మైసూరు పాక్ సిద్దం
మాదప్ప కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రత్యేకంగా మైసూరు పాక్ స్వీట్ తయారు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మైసూరు పాక్ స్వీట్ రుచిచూడటానికి మాకు అవకాశం ఇవ్వాలని కాకాసుర మాదప్ప కుటుంబ సభ్యులు కర్ణాటక ప్రభుత్వానికి, అధికారులకు మనవి చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మైసూర్ పాక్ స్వీట్ రుచి చూస్తారా ? లేదా ? అనే విషయంలో క్లారిటీ లేదని అధికారులు అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications