త్వరలో లోక్ సభ సీట్ల పెంపు, జరిగిదిదే - ప్రధాని మోదీ కీలక ప్రకటన..!!

నూతన పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసారు. భారత్‌ కొత్త యాత్ర ప్రారంభించిందన్నారు. ఎన్నో ఆటంకాలను దాటుతూ భారత్‌ అమృతోత్సవ వేళకు చేరుకుందన్నారు. కొత్త భవనం భారత భవిష్యత్తును మరింత ఉజ్వలం చేస్తుందన్నారు. పార్లమెంటు కొత్త భవనం ఈ ప్రయత్నానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు. ఇదే సమయంలో పార్లమెంట్ సభ్యుల సంఖ్యల పెంపు పై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేసారు. పార్లమెంట్ కేవలం భవనం కాదని..ప్రజల ఆకాంక్షల ప్రతిబింభమని వివరించారు.

భారత్ అగ్ర స్థానంలో : రానున్న రోజుల్లో ప్రపంచ యవనికపై భారత్ అగ్ర స్థానంలో నిలుస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేసారు. పార్లమెంట్ లో ఉదయం నుంచి సంప్రదాయ పద్దతిలో నిర్వహించిన కార్యక్రమాల తరువాత ప్రధాని మోదీ నూతన పార్లమెంట్ లో తొలి ప్రసంగం చేసారు. మెరుగైన సభా కార్యకలాపాల కోసమే కొత్త భవనం నిర్మాణం చేసామని వివరించారు. ఇదే సమయంలో కీలక ప్రకటన చేసారు. రానున్న కాలంలో ఎంపీల సంఖ్య పెరుగుతుందని మోదీ చెప్పారు. పాత పార్లమెంటు భవనంలో అనేక ఇబ్బందులు ఉండేవని, సభ్యులు కూర్చోవడానికే కాకుండా, సాంకేతిక సమస్యలు కూడా ఉండేవని చెప్పారు. రాబోయే కాలంలో ఎంపీల సంఖ్య పెరుగుతుందని, అందుకు తగినట్లుగానే నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించామని చెప్పారు. కొత్త భవనంలో ఆధునిక వసతులు ఉన్నాయని చెప్పారు.

modi

అమృత మహోత్సవంలో : అమృత మహోత్సవంలో భారతీయులు తమ ప్రజాస్వామ్యానికి ఈ నూతన పార్లమెంటు భవనాన్ని బహూకరించుకున్నారని తెలిపారు. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ సర్వమత ప్రార్ధనలు జరిగాయి. సంప్రదాయం..ఆదునీత మేళవింపుతో కొత్త పార్లమెంట్ ను నిర్మాణం చేసినట్లు ప్రధాని వెల్లడించారు. భారత దేశం అభివృద్ధి చెందడమంటే, ప్రపంచ అభివృద్ధికి దోహదపడటమని తెలిపారు. కొత్త పార్లమెంటు భవనం ప్రజాస్వామ్య దేవాలయమని పేర్కొన్నారు. ప్రపంచమంతా భారత దేశంవైపు ఆసక్తిగా చూస్తోందన్నారు. కొత్త పార్లమెంటు భవనం భారత దేశ గౌరవాన్ని మరింత పెంచిందని చెప్పారు. నవ భారతం కొత్త పంథాలో దూసుకెళ్తుందన్నారు. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు కొత్త పార్లమెంట్ ద్వారా నెరవేరుతాయని ప్రధాని చెప్పుకొచ్చారు.

ఆత్మనిర్భర్ భారత్ కు సాక్షిగా : నూతన పార్లమెంట్ ఆత్మనిర్భర్ భారత్ కు సాక్షిగా నిలుస్తుందన్నారు. కొత్త ఆలోచనలు..బలమైన సంకల్పంతో భారత్ ముందుకు పయణిస్తోందని వివరించారు.ప్రపంచం మొత్తం దేశం వైపు చూస్తోందన్నారు. పెరగనున్న ఎంపీల సంఖ్యకు అనుగుణంగా ఆధునిక వసతులతో కొత్త భవనం నిర్మించామన్నారు. 21వ శతాబ్దంలో భారత్‌ ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకుంది. దేశం బానిస వాసనలను వదిలిపెట్టి ముందుకెళ్తోంది. పార్లమెంటు కొత్త భవనం ఈ ప్రయత్నానికి సజీవ చిహ్నంగా మారిందన్నారు. గడిచిన 9 ఏళ్లుగా నవ నిర్మాణం, పేదల సంక్షేమం కోసం కృషి చేశామన్నారు. ఆజాదీకా అమృతకాలం.. దేశానికి కొత్త దిశను నిర్దేశించే కాలం గా పేర్కొన్నారు. కొత్త భారతావనికి ఆజాదీకా అమృతకాలం మార్గం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+