ప్లీజ్.. మీరు ప్రచారానికి వెళ్లకండి! గుజరాత్ ఎన్నికల్లో కపిల్ సిబాల్‌ను పక్కనపెట్టిన కాంగ్రెస్?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : రామ జన్మభూమి కేసు విషయంలో వివాదాన్ని రాజేసి కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బందుల్లో పడేసిన ఆ పార్టీ సీనియర్‌ నేత, న్యాయశాఖ మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ను గుజరాత్‌ ఎన్నికల ప్రచారం నుంచి కాంగ్రెస్‌ పార్టీ దూరం పెట్టింది.

గుజరాత్‌ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన ప్రచారానికి దూరంగా ఉండాలని సూచించింది. మంగళవారం సుప్రీంకోర్టులో రామజన్మభూమి కేసు విచారణ జరుగుతుండగా సున్నీ వక్ఫ్‌ బోర్డు తరుపున వాదనలు వినిపిస్తున్న సిబల్‌.. ఈ కేసును 2019 జులై వరకు వాయిదా వేయాలని, ఆలోగా సాధారణ ఎన్నికలు పూర్తవుతాయని అన్నారు.

PM Modi hits out at Kapil Sibal, slams Congress for linking Ram temple issue to polls

దీంతో ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా తీసుకున్న బీజేపీ గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో వాటిని తమకు అస్త్రంగా వాడుకుంది. బుధవారం అక్కడ ప్రచారంలో పాల్గొన్న మోడీ విమర్శల వర్షం కురిపించారు.

ఎన్నికలకు, రామ జన్మభూమికి ఎందుకు సంబంధం అంటగడుతున్నారని ప్రశ్నించారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్‌ తమ ప్రచారానికి సిబల్‌ వ్యవహారం ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని ఆయనను దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On the last day of campaigning for the first phase of Gujarat elections, Prime Minister Narendra Modi focused his attack on Kapil Sibal for seeking deferment of the Ayodhya dispute till the 2019 Lok Sabha elections and panned Congress for linking the issue with polls. “Yesterday in the Supreme Court, a Congress MP Kapil Sibal was arguing for the Babri Masjid. He is entitled to do that but is it right for him to say postpone hearing till 2019? Now, the Congress is linking Ram Mandir with elections. They are least bothered about the nation,” Modi said at a rally in Dhandhuka.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X