Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sandeshkhali: మమతా బెనర్జీ సర్కారుపై మోడీ నిప్పులు, ప్రధానితో సీఎం భేటీ

కోల్‌కతా: సందేశ్‌ఖాళీ అరాచకాల నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లోని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. సందేశ్​ ఖాలీలో మహిళలపై జరిగిన వేధింపుల గురించి సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్​ రాయ్‌కు తెలిస్తే ఆయన ఆత్మ ఘోషించేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హుగ్లీ జిల్లా ఆరంబాగ్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని.. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

సందేశ్‌ఖాలీలో సోదరీమణులకు టీఎంసీ ఏం చేసిందో దేశం మొత్తం చూసిందంటూ ప్రధాని మోడీ విమర్శించారు. ఈ ఘటనపై ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్‌ షేక్‌ తన పరిధులను దాటాడని దుయ్యబట్టారు. కానీ, బీజేపీ నేతలు సందేశ్‌ఖాలీ మహిళల గౌరవం కోసం పోరాడారని ప్రధాని వెల్లడించారు.

PM Modi Hits Out At mamata banerjees govt Over Sandeshkhali

మమతా బెనర్జీ ప్రభుత్వం పేదలు, రైతులు, యువత, మహిళల సాధికారతకు అతిపెద్ద అడ్డంకిగా ఉంది. ఈ నాలుగు వర్గాలు సాధికారత సాధించనంత వరకు బెంగాల్‌ అభివృద్ధి చెందదు. బీజేపీ ప్రభుత్వమే లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు కోటా కల్పించింది. బీజేపీ ప్రభుత్వమే నమో డ్రోన్‌ దీదీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు ఆధునిక డ్రోన్లను ఎగురవేయటంపై శిక్షణ ఇస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు.

బీజేపీ ప్రభుత్వం గ్రామగ్రామాన మహిళా సంఘాలకు లక్షలకోట్ల సాయం అందిస్తోంది. దేశంలో 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేసే సంకల్పం తీసుకున్నామని ప్రధాని మోడీ వివరించారు. 21వ శతాబ్దంలో భారత్‌ వేగంగా పురోగమిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మనమందరం కలిసి సంకల్పం తీసుకున్నట్లు చెప్పారు.

గత పదేళ్లలో కేంద్రం చేపట్టిన సంక్షేమ పథకాల కారణంగా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని మోడీ వివరించారు. కాగా, హుగ్లీ జిల్లాలోని ఆరంబాగ్‌లో రూ.7,200 కోట్ల విలువ కలిగిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు ప్రధాని మోడీ. రైలు, పోర్టులు, ఆయిల్‌ పైప్‌లైన్‌, ఎల్​పీజీ సరఫరా, మురికినీటి శుద్ధి ప్లాంటు వంటి అభివృద్ధి పనులకు భూమిపూజ చేయటమే కాకుండా వాటిని జాతికి అంకితం ఇచ్చారు. దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా బెంగాల్‌లోనూ రైల్వేల ఆధునీకరణకు వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోడీ వివరించారు. బెంగల్ సంపూర్ణ అభివృద్ధి కోసం బీజేపీకి మద్దతుగా నిలవాలని ప్రజలను కోరారు.

ప్రధాని మోడీతో సీఎం మమతా బెనర్జీ భేటీ

ప్రధాని నరేంద్ర మోడీతో మర్యాదపూర్వకంగా కలిశారు పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఇది కేవలం ప్రోటోకాల్​ సమావేశమేనని, ఇందులో రాజకీయ చర్చలేమీ జరగలేదని ఆమె తెలిపారు. 'ఇది కేవలం ప్రోటోకాల్​ భేటీనే, ఎటువంటి రాజకీయ పరమైన చర్చలు ఈ సమావేశంలో జరగలేదు' అని సమావేశం అనంతరం మమతా బెనర్జీ మీడియాకు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+