రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ
PM Modi: దేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్ది సేపటి కిందటే దేశ రాజధానిలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం వరుసగా ఇది 11వ సారి. 2014 ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆయన వరుసగా రెడ్ ఫోర్ట్‌పై మువ్వన్నెలను రెపరెపలాడిస్తోన్నారు.
ఎర్రకోటకు చేరుకున్న వెంటనే త్రివిధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం త్రివర్ణ పతకాన్ని ఎగురువేశారు. ఆ సమయంలో హెలికాప్టర్లు ద్వారా పూల వర్షం కురిపించారు. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తోన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా 2047 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, వాటిని అందుకోవడానికి రూపొందించుకున్న భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను వివరిస్తోన్నారు.

అంతకుముందు తన అధికారిక నివాసం నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ.. నేరుగా రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ సమాధికి నివాళి అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. అక్కడ మోదీకి పలువురు కేంద్రమంత్రులు, ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్వాగతం పలికారు.
త్రివిధ దళాల నుంచి గౌరవ వందనాన్ని అందుకున్న తరువాత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనటు చోటు చేసుకోకుండా ఉండటానికి ఢిల్లీ పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. నగర వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరింపజేశారు. డ్రోన్లను ఎగురవేయడాన్ని నిషేధించారు. రెడ్ ఫోర్ట్‌కు దారి తీసే మార్గాల్లో జామర్లను అమర్చారు. వాహనాలను దారి మళ్లించారు.












Click it and Unblock the Notifications