ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధంపై భారత్ వైఖరి ఇదే: ఇజ్రాయెల్ ప్రధానికి తేల్చి చెప్పిన మోదీ

జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఆరంభమైన యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది. నాలుగో రోజూ కొనసాగుతోంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలనపై ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది.

శనివారం సాయంత్రం ఆరంభమైన హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో ఇప్పటికి 1,000 మందికి పైగా ఇజ్రాయెలియన్లు మరణించారు. ఈ సంఖ్య అక్కడితో ఆగే అవకాశాలు లేవు. రాకెట్ దాడుల్లో సుమారు 2,500 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంటోంది. అటు గాజా స్ట్రిప్‌లోనూ మరణాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఇప్పటివరకు 500 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది.

PM Modi holds telephonic conversation with his counterpart of Israel Benjamin Netanyahu

తొలుత ఇజ్రాయెల్- పాలస్తీనా సరిహద్దు వెంబడి గాజా సమీప ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేశారు. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

గాజా సరిహద్దు వెంబడి ఉన్న ఇజ్రాయెల్‌లోని అనేక స్థానాలను హమాస్ ఉగ్రవాదులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అక్కడ తమ చేతికి చిక్కిన ఇజ్రాయెలీలను గాజా స్ట్రిప్‌కు తరలించడం మొదలు పెట్టారు. వందలాది మంది ఇజ్రాయెలీలను వారు బందీలుగా పట్టుకున్నట్లు మీడియా తెలిపింది.

దీనితో ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ను ప్రకటించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా హమాస్ వ్యవహరిస్తోందని, దాడులకు పాల్పడిన తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

ఈ పరిణామాల మధ్య ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. యుద్ధంపై అప్‌డేట్స్ ఇచ్చారు. హమాస్ మిలిటెంట్ల దాడుల అనంతరం ఇజ్రాయెల్‌లో నెలకొన్న పరిణామాల గురించి వివరించారు. పాలస్తీనా, గాజా స్ట్రిప్‌‌పై ఎదురుదాడికి దిగినట్లు తెలియజేశారు. అత్యవసర పరిస్థితుల్లో అండగా ఉండాలని కోరారు.

దీనిపై మోదీ సానుకూలంగా స్పందించారు. భారత ప్రజలు ఇజ్రాయెల్ వెంటే ఉంటారని స్పష్టం చేశారు. ఇలాంటి కష్ట సమయంలో భారత్.. ఇజ్రాయెల్ ఉంటే ఉంటుందనే భరోసాను ఇచ్చారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని, అది ఏ రూపంలో ఉన్నా అంతమొందించాలనేదే తమ లక్ష్యమని మోదీ చెప్పారు. ఈ మేరకు మోదీ ఓ ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+