వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీని వరించిన రష్యా అత్యున్నత పౌరపురస్కారం అవార్డు

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్రమోడీని రష్యా ప్రభుత్వం ఆదేశ అత్యున్నత పౌర పురస్కారం "ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపొస్తుల్"ను ప్రకటించింది. రష్యా భారత్‌ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య నిర్మాణం కోసం మోడీ కృషి చేసినందుకు గాను ఈ అవార్డును రష్యా ప్రకటించిందని భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.

"ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపొస్తుల్" అవార్డును 17వ శతాబ్దంలో పీటర్ ది గ్రేట్ ఏర్పాటు చేశారు. ఇక రష్యా ఇస్తున్న అవార్డుల్లో ఇదే అత్యంత పురాతణమైనది అదే సమయంలో అత్యంత విలువైన పురస్కారంగా అక్కడి వారు భావిస్తారు. "ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపొస్తుల్" అవార్డును సోవియెట్ యూనియన్‌గా ఉన్న సమయంలో దీన్ని రద్దు చేశారు. అయితే రష్యా సోవియెట్ యూనియన్ నుంచి వేరుపడ్డాక 1998లో తిరిగి ఈ అవార్డును పలువురు ప్రముఖులకు అందజేస్తూ వస్తున్నారు.

PM Modi honoured with Russias highest civilian award

"ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపొస్తుల్" అవార్డును రాజకీయ నాయకులకు, పలు రంగాల్లో పేరుగాంచిన నాయకులకు వారు చేసిన కృషికి సేవకు అందిస్తోంది రష్యా ప్రభుత్వం. 2017లో "ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపొస్తుల్"అవార్డును చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రకటించింది రష్యా ప్రభుత్వం. ఇక రష్యాకు చెందిన అత్యున్నత పౌర పురస్కారం మోడీని వరించడంతో ... మొత్తం అంతర్జాతీయ అవార్డుల సంఖ్య ఏడుకు చేరుకుంది. రష్యా అత్యున్నత పౌర పురస్కారం కంటే ముందు మోడీని యూఏఈ, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, పాలిస్తీన, అఫ్ఘానిస్తాన్ దేశాలు తమ అత్యున్నత పురస్కారాలతో మోడీని గౌరవించాయి.

English summary
Russia has awarded Prime Minister Narendra Modi Order of St Andrew the Apostle, the highest order of the Russian Federation. PM Modi was awarded the order for "exceptional services in promoting special & privileged strategic partnership between" Russia and India, the Russian embassy in India said in a tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X