ఇక లడఖ్ కు ఎప్పుడైనా వెళ్లొచ్చు-8500 అడుగుల ఎత్తులో సొరంగం ప్రారంభించిన మోడీ..!

జమ్మూకశ్మీర్ లో కీలకమైన లడఖ్ ప్రాంతంలో ఇకపై పర్యాటకులు సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడైనా వెళ్లొచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో మంచు గడ్డ కడుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ మేరకు సోనా మార్క్ లోని జడ్ మోర్ సొరంగాన్ని ఇవాళ ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సొరంగం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో సాధారణ ప్రజలతో పాటు సైనిక అవసరాలకు కూడా ఎంతో ఉపయోగపడనుంది.

శ్రీనగర్-లేహ్ హైవేపై ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన సోనామార్గ్ సమీపంలోని గగాంగీర్ గ్రామం సమీపంలో ఈ సొరంగాన్ని నిర్మించారు. ఇది వ్యూహాత్మక, సైనిక కారణాల కోసం ముఖ్యమైన సొరంగం. అంతే కాదు వివిధ వాతావరణ పరిస్ధితుల్లోనూ సురక్షితంగా ప్రయాణించడానికి వీలుగా నిర్మించారు. ఈ సొరంగం ఉన్న ప్రాంతం సముద్ర మట్టానికి 8,500 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది. అలాగే శీతాకాలంలో మంచు హిమపాతాలకు గురవుతుంది. ఇది సీజన్‌లో చాలా వరకు సోనామార్గ్ రోడ్డు మూసేస్తోంది.

pm modi inaugurates crucial Z-morh Tunnel in Ladakh- here are key features

ఈ ప్రాజెక్ట్ వాస్తవానికి 2012లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ప్రారంభించింది. బీఆర్వో నిర్మాణ కాంట్రాక్ట్‌ను టన్నెల్‌వే లిమిటెడ్‌కు అప్పగించగా, ప్రాజెక్ట్ తర్వాత NHIDCL తీసుకుంది. 2019లో NHIDCL ప్రాజెక్ట్‌కు మళ్లీ టెండర్లు పిలిచింది. ఇది ఆగస్ట్ 2023 నాటికి ప్రాజెక్ట్ పూర్తి కావాల్సి ఉండగా ఆలస్యమైంది. సొరంగం సాఫ్ట్-ఓపెనింగ్ మాత్రం గతేడాది ఫిబ్రవరిలో జరిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ప్రాజెక్ట్ అధికారిక ప్రారంభోత్సవం ఆలస్యం అయింది. వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్ లడఖ్‌కు అన్ని-వాతావరణ కనెక్టివిటీకి కీలకం. సోనామార్గ్‌కు ఏడాది పొడవునా వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+