ఇది రైల్వే స్టేషనా..? లేక ఎయిర్ పోర్టా..?
గుజరాత్ లోని సూరత్ లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ముంబై- అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ పనులను సమీక్షించారు. అలాగే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ టీమ్ తో చర్చించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు. బుల్లెట్ ట్రైన్ స్పీడ్, టైమింగ్ పై ఆరా తీశారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్ ఎలాంటి అవరోధాలు లేకుండా సాగుతోందని అక్కడి టీమ్.. ప్రధాని మోదీకి తెలిపారు.
గుజరాత్ లోని సూరత్ లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ స్టేషన్ పనులను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని అక్కడి టీమ్ తో చర్చించారు. ముంబై- అహ్మదాబాద్ హై స్పీడ్ ప్రాజెక్ట్ లో భాగంగా సుమారు 508 కిలోమీటర్ల హై స్పీడ్ రైల్ కారిడార్ ను నిర్మిస్తున్నారు. ఇది భారత్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల్లో ఒకటి. మొత్తం 508 కిలోమీటర్లలో గుజరాత్, దాద్రా నగర్ హవేలీలో 352 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 156 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.

ఈ కారిడార్ సబర్మతి, అహ్మదాబాద్, వడోదరా, సూరత్, విరార్, థానే, ముంబై లాంటి ప్రధాన పట్టణాలను కలుపుతుంది. అడ్వాన్స్ డ్ ఇంజినీరింగ్ టెక్నాలజీస్ తో ఈ కారిడార్ నిర్మాణం కానుంది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా 465 కిలోమీటర్ల మేర వయాడక్ట్స్ ఉండగా.. ఇప్పటి వరకు 326 కిలోమీటర్ల మేర వయాడక్ట్ పూర్తయింది. అలాగే మొత్తం 25 నదీ వంతెనల్లో 17 ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో భాగంగా ముంబై- అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం 2 గంటలలోపే తగ్గనుంది.
ఈ ప్రాజెక్ట్ తో టూరిజం అభివృద్ధి, బిజినెస్, ఎకానమిక్ యాక్టివిటీ పెంపొందనుంది. ఇక సూరత్- బలిమోరా సెక్షన్ పనులు ప్రస్తుతం అడ్వాన్స్ డ్ లెవెల్ లో ఉన్నాయి. సివిల్ వర్క్స్, ట్రాక్- బెడ్ లేయింగ్ పూర్తయింది. సూరత్ స్టేషన్ ను అత్యద్భుతంగా డిజైన్ చేశారు. సూరత్ కు ప్రపంచంలోనే డైమండ్స్ ఇండస్టీకి పేరుగాంచింది. ఈ స్ఫూర్తితో స్టేషన్ ను వినూత్నంగా తీర్చిదిద్దుతున్నారు.












Click it and Unblock the Notifications