అయోధ్య ఆలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ - ముహూర్తం ఖరారు, ప్రత్యేకంగా..!!

శ్రీరాముడి భక్తుల దశాబ్దాల నిరీక్షణ ఫలించే సమయం సమీపించింది. జనవరి 22, 2024న అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ రామ్ లల్లాకు 'ప్రాణ ప్రతిష్ఠ' చేయనున్నారు. ఆలయ గర్భగుడి వద్ద రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల హిందూ సాధవులను ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానించనున్నారు. పది వేల మంది ప్రత్యేక అతిధులు హాజరు కానున్నారు.

అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ గర్భగుడిలో జనవరి 21,22,23 తేదీల్లో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. ఈ వేడుకకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ సాధువుల, పలువురు ప్రతినిధులు హాజరుకానున్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. ప్రత్యేకంగా వేదిక, బహిరంగ సమావేశం ఉండదని స్పష్టం చేసారు.

PM Modi invited to the installation of the idol of Lord Ram in Ayodhya Temple on Januaray 22, 2024

136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల మంది సాధువులను ప్రాణ ప్రతిష్ఠ వేడుకలకు ఆహ్వానించనున్నారు. ఆలయ ట్రస్టు వీరి జాబితా సిద్దం చేస్తోంది. త్వరలోనే ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నిత్య గోపాల్ దాస్ తరపున వారికి ఆహ్వాన లేఖలు పంపుతామని చెప్పారు. వీరికి అయోధ్యలోని ప్రముఖ మఠాల్లో వసతి కల్పిస్తామన్నారు. సాధువులు కాకుండా మరో పది వేల మంది ప్రత్యేక అతిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు. మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ శ్యామశీల రామ్ లల్లా ఈ విగ్రహాన్ని నిర్మించారు.

PM Narendra Modi

విగ్రహానికి సంబంధించిన తాత్కాలిక చిత్రాలను ఆలయ ట్రస్టు సభ్యులు సేకరించి ఖరారు చేశారు. లార్డ్ రామ్‌ లల్లా విగ్రహంలో రాముడు .. ముఖం మీద మధురమైన చిరునవ్వుతో, చేతిలో విల్లుతో నిలబడి ఉంటాడు. అలాగే కర్ణాటకలోని కర్కర్, హిగ్రీవన్‌కోట్ గ్రామాల నుంచి తీసుకొచ్చిన రాళ్లతో ఈ విగ్రహాన్ని నిర్మిస్తామని ఇంతముందే అధికారులు చెప్పారు. మైసూర్‌ శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు అయోధ్య చేరుకున్నారు. విగ్రహ ప్రతిష్టాపన సమయం రాజకీయంగా కీలకమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+