మోదీ వరాల సునామీ- రూ. వేల కోట్లు గుమ్మరింత: రిజల్ట్ ఎలా ఉంటుందో గానీ..
Maharashtra Assembly election 2024: ఇంకొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది మహారాష్ట్ర. జార్ఖండ్‌తో కలిసి ఒకేసారి పోలింగ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం హర్యానాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది.
జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది కూడా. చివరి విడత ఎన్నికలు అక్టోబర్ 1న షెడ్యూల్ అయ్యాయి. హర్యానాలో అక్టోబర్ 5వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ రెండు చోట్ల ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే జార్ఖండ్, మహారాష్ట్రల అసెంబ్లీ షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది.

మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మహారాష్ట్రలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 202. ప్రస్తుతం ఇక్కడ ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఈ సంఖ్యాబలాన్ని అందుకోలేదు.
ఫలితంగాశివసేన- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటింది. అది ఎంతోకాలం మనుగడ సాగించలేకపోయింది. ఆపరేషన్ కమల చేపట్టింది బీజేపీ. శివసేనలో చీలికను తీసుకుని రాగలిగింది. ఉద్దవ్ థాకరే ప్రభుత్వాన్ని విజయవంతంగా కూల్చివేయగలిగింది. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తోన్నారు. ఈ సారి సంపూర్ణ మెజారిటీని సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి ఆయా పార్టీలన్నీ కూడా. దీనికోసం వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.
PM Shri @narendramodi lays foundation stone, inaugurates various projects in Maharashtra. https://t.co/YjQasVEEal
— BJP (@BJP4India) September 29, 2024
ఈ పరిణామాల మధ్య- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రపై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును గుమ్మరించారు. వీటి విలువ 11,200 కోట్ల రూపాయలు. ఆయా ప్రాజెక్టును ప్రారంభించడానికి, కొన్నింటికి శంకుస్థాపన చేయడానికి నేడు మోదీ పుణేలో పర్యటించాల్సి ఉండగా- భారీ వర్షాల వల్ల అది రద్దయింది. దీనితో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందులో పాల్గొన్నారు.
పుణె మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేస్- 1ను ప్రారంభించారు మోదీ. జిల్లా కోర్టు నుంచి స్వర్‌గేట్ మధ్య నిర్మించిన తొలి కారిడార్ ఇది. అలాగే- ఫేస్ 2 నిర్మాణ పనులకూ శంకుస్థాపన చేశారాయన. మార్కెట్ యార్డ్, పద్మావతి, కాట్రాజ్ మధ్య సుమారు 2,955 కోట్ల రూపాయల వ్యయంతో 5.46 కిలోమీటర్ల మేర భూగర్భ మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు.
అలాగే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 7,855 ఎకరాల విస్తీర్ణంలో బిడ్కిన్ ఇండస్ట్రియల్ ఏరియాను కూడా మోదీ ప్రారంభించారు. ఢిల్లీ-ముంబై ఇండస్ట్రియల్ కారిడార్‌లో భాగం ఇది. ఈ ఇండస్ట్రీయల్ ఏరియా వల్ల వెనుకబడిన మరాఠ్వాడా రీజియన్ ఆర్థికంగా పురోగమిస్తుందని భావిస్తోన్నారు.












Click it and Unblock the Notifications