గుజరాత్ లో మోడీ భారీ రోడ్ షో-నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయ గర్జనతో- ఇక నెలకోసారి
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న వేళ విజయ సంకేతంగా ప్రధాని మోడీ.. గుజరాత్ లో ఇవాళ భారీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి గాంధీ నగర్ లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి మోడీ రోడ్ షో చేపట్టారు. ఇందులో వేల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, మోడీ అభిమానులు, నేతలు పాల్గొంటున్నారు.
Recommended Video
పూల దండలతో అలంకరించిన ఓపెన్ జీపులో ప్రయాణిస్తూ మోడీ అభిమానులకు అభివాదాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. విమానాశ్రయం నుంచి గాంధీనగర్‌లోని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యాలయం కమలం వరకు మోడీ రోడ్‌షో కొనసొగనుంది. ఈ సందర్భఁగా రోడ్డు పక్కన గుమిగూడిన వందలాది మంది మద్దతుదారులు, అభిమానుల వైపు ప్రధాని మోడీ ఉక్సాహంగా చేతులు ఊపుతూ విజయ సంకేతం చూపారు. ఎయిర్ పోర్టు నుంచి బీజేపీ కార్యాలయం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాని మోడీ వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ ఉన్నారు.

ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి తేదీలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సందర్భంగా సొంత రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రధాని మోడీ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా నెలకోసారి గుజరాత్ లో ఆయన పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా గుజరాత్‌కు బయలుదేరి వెళుతున్నాను, అక్కడ నేను ఇవాళ, రేపు వివిధ కార్యక్రమాలకు హాజరవుతాను. సాయంత్రం 4 గంటలకు, పంచాయితీ మహాసమ్మేళనంలో ప్రసంగిస్తాను, అక్కడ పంచాయతీ రాజ్ సంస్థల నుండి పలువురు ప్రతినిధులు హాజరవుతారు," అని మోడీ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications