అద్వానీ పుట్టిన రోజు, ఇంటికెళ్లి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ 91వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్ఖషలు తెలిపారు. ఆద్వానీ ఆశీస్సులను అందుకున్నారు.
ప్రధాని మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితర ప్రముఖులు అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు. అద్వానీ దేశ రాజకీయాలకు అందించిన సేవలు అమోఘమని మోడీ ట్వీట్ కూడా చేశారు.

అద్వానీ దేశ విభజనకు ముందు, 1927లో కరాచీ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) జన్మించారు. 1951లో జనసంఘ్‌లో స్థాపించారు. ఈ పార్టీలో అద్వానీ పని చేశారు. 1980లలో బీజేపీ ఆవిర్భవించింది. వాజపేయితో పాటు అద్వానీ కూడా బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరు.
Went to Advani Ji’s residence and wished him on his birthday. pic.twitter.com/4We9Tp8Qui
— Narendra Modi (@narendramodi) November 8, 2018












Click it and Unblock the Notifications