ప్రధాని మోడీ అత్యున్నత సమీక్ష..! కేబినెట్ మార్పుల వేళ మంత్రులపై రిపోర్ట్..!

ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఆయన ఇవాళ భేటీ అయ్యారు. ఎన్డీయే సర్కార్ రెండేళ్ల పాలన తర్వాత ప్రభుత్వ పనితీరు, మంత్రుల పనితీరుపై ప్రధాని మోడీ వివరాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సంస్కరణలు, వ్యాపార సౌలభ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వంటి అంశాలపై ప్రధాని సమీక్షించారు. కేబినెట్ ప్రక్షాళన ప్రచారం వేళ ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

ఇథనాల్ వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్-సుప్రీంలో గుట్టు రట్టు..!
ఇథనాల్ వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్-సుప్రీంలో గుట్టు రట్టు..!

ప్రధానమంత్రి మోదీ (PM Modi) కేంద్ర మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. విధాన సంస్కరణలు, వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై ఆయన చర్చించారు. నిన్న సీషెల్స్‌లో తన అధికారిక పర్యటనను ముగించుకుని వచ్చిన ప్రధాని.. ఇవాళ కీలక అధికారులతో భేటీ అయ్యారు. రెండు నెలల్లో ప్రధానమంత్రి ఉన్నతాధికారులతో జరిపిన రెండవ ప్రధాన భేటీ ఇది.

PM Modi Meets Ministry Secretaries Focus on Faster Decisions Ease of Doing Business
Iran: ఖమేనీ అంత్యక్రియలు: మోడీ డుమ్మా వెనుక అసలు వ్యూహం ఇదేనా?
Iran: ఖమేనీ అంత్యక్రియలు: మోడీ డుమ్మా వెనుక అసలు వ్యూహం ఇదేనా?

మే 21న అభివృద్ధి చెందిన భారతదేశ దార్శనికతను సాకారం చేసే లక్ష్యంతో నియంత్రణ రోడ్‌మ్యాప్‌లను అభివృద్ధి చేయడానికి ప్రధాని మోడీ.. కేంద్ర మంత్రిమండలి, కేంద్ర కార్యదర్శుల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని .. వేగవంతమైన నిర్ణయాలు, సమర్థవంతమైన పాలన ఆవశ్యకతను గుర్తుచేశారు. ఫైళ్లు ఆలస్యం లేకుండా వేగంగా కదలాలని, సాధ్యమైనంత తక్కువ సమయంలో ఉత్పాదకతను గరిష్ఠ స్థాయికి పెంచాలని ప్రధానమంత్రి సూచించారు. ప్రభుత్వ పనితీరుపై మధ్యంతర సమీక్షగా ఈ సమావేశాన్ని పరిగణిస్తున్నట్లు ఏఎన్ఐ తెలిపింది. కేంద్రం పనితీరుపై విమర్శలు పెరుగుతున్న వేళ, కేబినెట్ మార్పులకు సిద్ధమవుతున్న ప్రధాని.. అంతకు ముందే మంత్రిత్వ శాఖలపై రిపోర్ట్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+