చైనా అధ్యక్షుడిని పొగడ్తల్లో ముంచెత్తిన ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానుసారంగా టారిఫ్ విధిస్తూ భారత్ ను బెంబేలెత్తిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైనే అందరి దృష్టీ నిలిచింది. ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? తదుపరి చర్యలు ఎలా ఉండబోతోన్నాయనేది చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల మధ్య ట్రంప్ కు చెక్ పెట్టనున్నారు ప్రధాని మోదీ. శత్రుదేశం చైనాతో మిత్రత్వాన్ని పెంపొందించుకుంటోన్నారు.
శనివారమే ఆయన చైనాలో ల్యాండ్ అయ్యారు. రెండు రోజుల జపాన్ పర్యటన ముగించుకుని నేరుగా చైనాకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ తో మోదీ ముఖాముఖి భేటీ అయ్యారు. టియాన్జిన్ లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ సైడ్ లైన్స్ లో భాగంగా ఈ భేటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా మోదీ ఆయనతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌ల నేపథ్యంలో సంబంధాలను పునర్నిర్మించుకోవడమే ఈ భేటీ ముఖ్య ఉద్దేశ్యం. భారత్- చైనా సంబంధాలకు పరస్పర విశ్వాసం, గౌరవం మార్గదర్శకం కావాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు కొత్త పునాది వేయాలని, ఆర్థిక, వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఈ భేటీ ఓ కీలక మలుపు కావాలని మోదీ ఆకాంక్షించారు. రెండు దేశాల స్నేహపూరక వాతావరణంలో సమస్యలను పరిష్కరించుకుంటాయనే ఆశాభావాన్నం వ్యక్తం చేశారు.
సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ప్రధాని మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని ప్రస్తావించారు. సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల మధ్య ఒప్పందం, కైలాష్ మానస సరోవర్ యాత్ర పునరుద్ధరణ, ఇరు దేశాల మధ్య విమాన సేవలు తిరిగి ప్రారంభం కావడం వంటి అంశాలను ఆయన వివరించారు. ఈ క్రమంలో తాము చైనీయుల విసాలను పునరుద్ధరించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇరు దేశాల్లో 2.8 బిలియన్ల ప్రజల ప్రయోజనాలు ఈ పరస్పర సహకారంతో ముడిపడి ఉన్నాయని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భారత్- చైనా మధ్య సత్సంబంధాలు పునరుద్ధరించుకుంటే ఆసియా- పసిఫిక్ రీజియన్ సహా అన్ని దేశాలు స్వాగతిస్తాయని అన్నారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో మన సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నామని తెలిపారు.
చివరిసారిగా ప్రధాని మోదీ 2018లో చైనాను సందర్శించారు. డోక్లామ్ కన్ ఫ్లిక్ట్ తర్వాత 2018లో ఆయన చివరిసారిగా వుహాన్‌కు వెళ్లొచ్చారు. ఇక మళ్లీ ఆయన చైనాలో అడుగు పెట్టడం ఇదే తొలిసారి. అది కూడా- డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న టారిఫ్ విధానాల వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొంటూ, ఆర్థిక, వ్యూహాత్మక సహకారంపై దృష్టి సారించడానికి చైనాతో సంబంధాలను పునరుద్ధరించుకుంటోన్నారు మోదీ. ఇదే భేటీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!











Click it and Unblock the Notifications