మోదీ యుద్ధతంత్రం, పాక్ ను ఏమార్చి - ఆపరేషన్ సింధూర్ వేళ ఆ నాలుగు గంటలు...!!

ఆపరేషన్ సింధూర్. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హోరెత్తుతోంది. పహల్గాం ఉగ్రదాడితో ఒక్క సారి గా పరిస్థితులు మారిపోయాయి. ఉగ్రవాదులను మట్టిలో కలిపేస్తామంటూ ప్రధాని నినదించారు. పహల్గాం దాడి జరిగిన నాటి నుంచి త్రివిధ దళాలు.. జాతీయ భద్రతా సలహదారులతో ప్రధాని వరుస సమావేశాలు నిర్వహించారు. తొలుత దౌత్య పరంగా పాక్ ను ఏకాకిని చేసారు. సింధూ నీటి నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసలు దాడుల గురించి ఆలోచన లేని సమయంలో 25 నిమిషాల్లో పాక్ లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్ర శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ వేళ మోదీ యుద్ద తంత్రం చూసి అభినందిస్తున్నారు.

పాక్ ను ఏమార్చి
ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తున్న పాక్ ను దెబ్బ తీయటంలో మోదీ స్టైలే వేరు. ప్రధాని మోదీ వ్యూహాలను పాక్ పసి గట్టలేక పోతోంది. భారత్ అనూహ్య దెబ్బకు సరెండర్ కాక తప్పటం లేదు. పాక్ పైన ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలకు కౌంటర్ కాదు.. కనీస ప్రతిస్పందన కూడా ఇవ్వలేని విధంగా దెబ్బ తింటోంది. 2019లో బాలాకోట్‌ దాడులతో పాటు తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌ విషయలోనూ ఈ విషయం నిరూపితమైంది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా 2019 ఫిబ్రవరి 26న బాలాకోట్‌పై భారత్‌ దాడికి దిగింది. దీనికి 48 గంటల ముందు ప్రధాని మోదీ ఎంతో ప్రశాంతంగా కనిపించారు. 25న ఢిల్లీలో నేషనల్‌ వార్‌ మెమోరియల్‌ను జాతికి అంకితం చేశారు. ఆ సమయంలో భారత సాయుధ దళాల పరాక్రమం గురించి ఆయన ప్రసంగించారు.

pm-modi-moves-strategically-with-operation-sindoor-to-target-terror-camps

సర్జికల్ స్ట్రైక్స్ వేళ
ఇక, 26 రాత్రి 9 గంటలకు వాయుసేన దాడులకు సిద్ధమవుతున్న సమయంలో కూడా ఢిల్లీలో మీడియా సదస్సులో మోదీ ప్రసంగించారు. ఆ సమయంలోనూ ఆయన ముఖంలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. చివరకు మన బలగాలు విజయవంతంగా ఆపరేషన్‌ను ముగించాయి. ఇక, ఇప్పుడు ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టడానికి ముందు కూడా ప్రధాని ప్రశాంతంగా ఉన్నారు. అప్పటిలాగానే దాడులకు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 2047 నాటికి ఆర్థిక దిగ్గజంగా ఎదగాలన్న దేశ ఆకాంక్షల గురించి మాట్లాడారు. ఆయన ముఖంలో ఎక్కడా ఒత్తిడి, ఆందోళన ఛాయామాత్రంగా కూడా కనిపించలేదు. పైగా నవ్వుతూ, జోకులు వేస్తూ మాట్లాడారు. ఇంకోవైపు దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్స్‌ ప్రకటించడం ద్వారా దేశ ప్రజలను సైనిక చర్యకు, దాని పర్యవనానాలకు సన్నద్ధం చేస్తున్నారని ప్రత్యర్థి దేశంతో సహా అందరూ భావించారు.

Take a Poll

పాక్ కోలుకునే లోపే
అయితే ఇదంతా తమను ఏమార్చడానికి పన్నిన వ్యూహం అని పాక్‌కు అర్థమయ్యే సరికి మన బలగాలు తమ పనిని విజయవంతంగా పూర్తి చేశాయి. ఆపరేషన్ సింధూర్ ప్రారంభానికి ముందే ప్రధాని కార్యాలయం నుంచి అమెరికా, యూకే వంటి దేశాలకు భారత్ పరిస్థితిని వివరించింది. పాక్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాల గురించి పూర్తి సమాచారం విశ్లేషించింది. పాక్ భూ భాగంలోని టెర్రర్ క్యాంప్స్ ను టార్గెట్ చేసింది. ఎక్కడా గురి తప్పలేదు. నిర్దేశిత లక్ష్యాలను చేధించింది. ఫలితంగా 25 నిమిషాల్లో వెయ్యి కిలో మీటర్ల పరిధిలోని తొమ్మది ఉగ్రవాద శిబిరాలు నేల మట్టం అయ్యాయి. భారీ సంఖ్యలో ఉగ్రవాదులను మట్టిలో కలిపేసారు. పహల్గాం ఉగ్రదాడి బాధితులు మోదీ నిర్ణయం పైన అభినందిస్తున్నారు. యావత్ దేశం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసిన సైన్యానికి సెల్యూట్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+