3 రోజులు గుజరాత్‌లో మోడీ పర్యటన.. డబ్ల్యుహెచ్‌వో చీఫ్ కూడా..
ప్రధాని మోడీ రేపటినుంచి తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తారు. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. గాంధీనగర్, బనస్కాంత, జామ్ నగర్, దాహొద్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొండారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తానని ఈ మేరకు ఆయన ఆదివారం ట్వీట్ చేశారు. అయితే మోడీతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డాక్టర్ టెడ్రొస్ కూడా పాలుపంచుకుంటారు. కొన్ని కార్యక్రమల్లో మోడీతో కలిసి ఆయన వేదిక పంచుకుంటారు.
సోమవారం టెడ్రొస్ రాజ్ కొట్ చేరుకుంటారు. జామ్ నగర్‌లో డబ్ల్యుహెచ్ వో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రేడిషినల్ మెడిసిన్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. మారిషస్ ప్రధానమంత్రి ప్రవీంద్ కుమార్ కూడా రాజ్ కొట్‌లో సోమవారం జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.

సోమవారం విద్యా సమీక్ష కేంద్రాన్ని కూడా మోడీ సందర్శిస్తారు. విద్యారంగంలో పలువరితో తాను ఇంటరాక్ట్ అవుతానని మోడీ చెప్పారు. మంగళవారం బనస్కాంతలో కార్యక్రమాలు ఉంటాయి. వీటి కోసం ప్రభుత్వం రూ.600 కోట్లు ఖర్చు చేయనుంది. బనాస్ డైరీ కాంప్లెక్స్.. పొటాపొ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రారంభిస్తారు. ఈ రెండింటితో స్థానిక రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
మంగళవారం డబ్ల్యుహెచ్ వో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషినల్ మెడిజిన్, బుధవారం గాంధీనగర్‌లో గల మహాత్మా మందిర్ ఆయుష్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్నొవేషన్ సమ్మిట్‌లో పాల్గొంటారు. తర్వాత దాహొద్‌లో ఆదివాసి మహా సమ్మేళనంలో పాల్గొంటారు. ఇదీ పేదలకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. బనాస్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇదీ వ్యవసాయానికి సంబంధించిన సందేహాలు ఉంటే నివృత్తి చేస్తోంది. దాదాపు 5 లక్షల మంది రైతులు.. 1700 గ్రామాలకు రెడియో అనుసంధానం కానుంది.












Click it and Unblock the Notifications