న్యూక్లియర్ డీల్ ఓకే: మోడీ, ఒబామా మధ్య కుదిరిన ఒప్పందం
న్యూఢిల్లీ: భారత్, అమెరికా మధ్య ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న న్యూక్లియర్ డీల్ ఖరారైంది. న్యూక్లియర్ డీల్‌లో అత్యంత ముఖ్యమైన 'ట్రాకింగ్ క్లాజు'ను తొలగించేందుకు అగ్రరాజ్యం అమెరికా అంగీకరించడం విశేషం. భారత అణు ఉపయోగాన్ని తాము పరిశీలించబోమని అమెరికా చెప్పడం.. దేశంలో చాలా మందికి సంతోషం కలిగించే విషయం.
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా తన సర్వాధికారాలను ఉపయోగించి ఈ క్లాజును తొలగించినట్లు మీడియాలో వార్తులు వస్తున్నాయి. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అణు సామాగ్రిని అమెరికా కంపెనీలు సరఫరా చేసిన రియాక్టర్లలో ఎలా ఉపయోగిస్తారో కూడా అమెరికా ట్రాక్ చేయబోదని ఈ క్లాజ్ ముఖ్య ఉద్దేశం.

మరికొద్ది సేపట్లో జరగనున్న సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు వాక్ అండ్ టాక్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, ఒబామా మధ్య ఇంకా పలు అంశాలపై కూడా చర్చలు జరిగాయి. వాటి గురించి కూడా ఈ సమావేశంలో వెల్లడిస్తారు. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధాలను బలోపేతం చేయడం... రక్షణ రంగంలో సహకారం లాంటి విషయాలపై ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.












Click it and Unblock the Notifications