Noida jinx: అక్కడికి వెళ్తే పదవి పోయినట్లేనా ? సెంటిమెంట్ పై మోడీ కామెంట్స్..!

ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలోని (Noida) జెవార్ లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ఇవాళ ప్రారంభించారు. ఎయిర్ పోర్టులో తొలి దశ నిర్మాణం పూర్తి కావడంతో అంత మేరకు ప్రధాని ఇవాళ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన మోడీ.. నోయిడాకు ఉన్న ఓ నెగిటివ్ సెంటిమెంట్ ను గుర్తుచేసుకున్నారు. ఇక్కడికి వస్తే పదవి పోతుందనే భావన చాలా మంది రాజకీయ నాయకుల్లో గతంలో ఉండేదని ప్రధాని వెల్లడించారు.

గతంలో యూపీని పాలించిన సమాజ్ వాదీ పార్టీ నేతలు నోయిడాకు వెళ్తే పదవి పోతుందనే మూఢ నమ్మకంతో ఇక్కడికి వెళ్లడం మానేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయలేదని ప్రధాని మోడీ(pm modi) ఇవాళ ఆరోపించారు. తాను తొలిసారి ప్రధాని అయిన తర్వాత నోయిడాకు వద్దామనుకుంటే.. యూపీలో సమాజ్ వాదీ పార్టీ ముఖ్యమంత్రి తాను అక్కడికి రాబోనని చెప్పారని, తనను కూడా వెళ్లొద్దని చెప్పినట్లు ప్రధాని గుర్తుచేసుకున్నారు. అయితే తాను మాత్రం అవేమీ పట్టించుకోకుండా నోయిడాకు వెళ్లినట్లు ప్రధాని తెలిపారు. ఒకప్పుడు రాజకీయ నాయకులు వదిలేసిన ఈ ప్రాంతం.. ఇప్పుడు ప్రపంచస్ధాయి నేతల్ని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉందన్నారు.

PM Modi Recalls Seat Lost Regret During Noida Visit Makes Key Remarks

మరోవైపు 1988 నుంచి నోయిడాలో ఈ సెంటిమెంట్ ప్రచారం మొదలైంది. అప్పట్లో 1988లో అక్కడ పర్యటించిన యూపీ సీఎం వీర్ బహదూర్ సింగ్ ఆ తర్వాత పదవి కోల్పోయారు. తర్వాత 1989లో ఎన్డీ తివారీ, 1995లో ములాయం సింగ్ యాదవ్, 19997లో మాయావతి, 1999లో కళ్యాణ్ సింగ్ కూడా ఇలాగే పదవులు కోల్పోయారు. ఆ తర్వాత కూడా సీఎంలు అక్కడికి వెళ్లడమే మానేశారు. 2013లో నోయిడాలో జరిగిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సదస్సుకు అప్పటి సీఎం అఖిలేష్ యాదవ్ కూడా హాజరుకాలేదు. 2017లో యోగీ ఆదిత్యనాథ్ ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి అక్కడికి వెళ్లారు. అయినా ఆ తర్వాత 2022లో మళ్లీ గెలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+