ఈసారీ సైలెంట్‌గా కానిచ్చిన మోదీ -కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ప్రధాని -వైరస్ పోరాడుదామంటూ
ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ కొవిడ్ -19 వ్యాక్సిన్ రెండో డోసును కూడా తీసుకున్నారు. గురువారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి వచ్చిన ఆయనకు నర్సులు టీకా వేశారు. మార్చి 1న టీకా తొలి డోసు తీసుకున్న ప్రధాని, 40 రోజుల తర్వాత ఇవాళ రెండో డోసు తీసుకున్నారు.
Recommended Video

రెండు సందర్భాల్లోనూ ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉదయమే ఆస్పత్రికి వచ్చి, సైలెంట్ గా పని కానిచ్చేశారు ప్రధాని. కేంద్ర సంస్థలు భాగస్వాములుగా ఉన్న భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకానే ప్రధాని తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా..

కొవిడ్ టీకా రెండో డోసు తీసుకున్న విషయాన్ని ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో స్వయంగా వెల్లడించారు. అర్హులైనవారంతా వెంటనే టీకాలు పొందాలంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ''ఇవాళ ఎయిమ్స్ లో నా రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నాను. కరోనా మహమ్మారిని ఓడించడానికి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న మార్గాల్లో టీకా ఒకటి. అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిన్ ద్వారా పేరు రిజిస్టర్ చేయించుకుని టీకాలను పొందండి'' అని ప్రధాని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటం, కొత్త కేసులు రోజుకు దాదాపు లక్ష చొప్పున వస్తుండటంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అదే సమయంలో వ్యాక్సిన్ల పంపిణీ కూడా వేగంగా సాగుతున్నది. కాగా, కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. వ్యాక్సిన్ల కొరత లేదని, అర్హత కలిగిన అందరికీ అందుబాటులో టీకాలను ఉంచామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ చెప్పారు. గురువారం నాటికి 9కోట్ల పైచిలుకు డోసుల పంపిణీ జరిగినట్లు పేర్కొన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications