ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్‌పై మోడీ విసుర్లు
అలీగఢ్: కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇండియా కూటమి ప్రజల సంపాదన, ఆస్తులపై కన్నేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మహిళల మంగళసూత్రాలపై వారి దృష్టి పడిందని, ఇండియా కూటమి నేతలు వాటిని దొంగలించేందుకు చూస్తున్నారని ఆరోపణలు చేశారు.
ప్రజల ఆస్తులపై సర్వే నిర్వహించి వాటిని అందరికీ పంచేయాలని కాంగ్రెస్ యోచిస్తోందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు ఇళ్లు ఉన్న వారి నుంచి ఒక ఇంటిని లాక్కుంటుందని విమర్శించారు. ఇటీవల కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేసిన సంపద పునర్ పంపిణీ ప్రకటనను ఉద్దేశిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈసారి మాత్రం ముస్లిం అనే మాటను వాడలేదు.
తనేను చివరిసారి అలీగఢ్‌కు వచ్చినప్పుడు సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ బంధుప్రీతి, అవినీతి బుజ్జగింపుల ఫ్యాక్టరీకి తాళం వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేశాను. మీరు దీన్ని చాలా చక్కగా చేశారు. కాబట్టి యువరాజులు (రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశించి) ఇద్దరూ దాని తాళం చెవిని పొందలేరు. మీ ఆశీర్వాదం కోసం ఈరోజు మళ్లీ ఇక్కడికి వచ్చాను అక్కడి ప్రజలతో వ్యాఖ్యానించారు ప్రధాని మోడీ.

ఒకప్పుడు హజ్ కోటా తక్కువగా ఉండడం వల్ల చాలా గొడవలు జరిగేవి. గత ప్రభుత్వాలు లంచాలు కూడా తీసుకున్నాయి. రాజకీయ ప్రాబల్యం ఉన్న వాళ్లే హజ్ కు వెళ్లేందుకు అవకాశం దక్కేది. భారత సోదరసోదరీమణులు అందరూ హజ్‌కు వెళ్లేందుకు కోటాను పెంచాలని నేను సౌదీ అరేబియా యువరాజును అభ్యర్థించాను. అయితే ఆయన హజ్ కోటాను పెంచడం మాత్రమే కాకుండా వీసా నియమాలను కూడా సులభతరం చేశారు. దీంతో చాలా మంది హజ్‌కు వెళ్తున్నారు. వారందరూ తనను ఆశీర్వదిస్తున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
#WATCH | Uttar Pradesh: Addressing a public rally in Aligarh, PM Narendra Modi says, "I want to warn the countrymen. Congress and the INDI alliance have their eyes on your earnings and your property. The 'Shehzada' of Congress says that if their government comes to power, they… pic.twitter.com/31sX9ZHFlO
— ANI (@ANI) April 22, 2024
రాష్ట్రంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేశాయని ప్రధాని మోడీ విమర్శించారు. ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఏమీ చేయలేదని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ వల్ల చాలా మంది ముస్లింల కుమార్తెల జీవితాలు నాశనం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది యువతులు, మహిళలు ఇబ్బంది పడ్డారని తెలిపారు. అందుకే తమ ప్రభుత్వ హయాంలో వారందరికీ ఉపయోగపడేలా ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చామని మోడీ వివరించారు. ప్రజలంతా మరోసారి బీజేపీని గెలిపించాలని కోరారు.












Click it and Unblock the Notifications