రాష్ట్రపతి ప్రసంగానికి రాజ్యసభలో ప్రధాని ధన్యవాదాలు- మరోసారి విపక్షాలపై విసుర్లు

పార్లెమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ రాజ్యసభలో ప్రధాని మోడీ తన సమాధానం ఇస్తున్నారు. నిన్న లోక్ సభలో ఇదే అంశంపై ప్రవేశపెట్టిన తీర్మానానికి సమాధానమిస్తూ విపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ.. ఇవాళ తన ప్రసంగంలోనూ విపక్షాల్ని టార్గెట్ చేస్తున్నారు.

మనం తప్పిదాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, కొత్త ఆలోచనల ద్వారా ఇది సాధ్యమని ప్రధాని మోడీ తెలిపారు. దేశం వందేళ్ల స్వాతంత్ర సందర్భానికి అనుగుణంగా వ్యూహరచన చేయాల్సి ఉందన్నారు. భారత కోవిడ్ నిర్వహణను ప్రపంచం మెచ్చుకుంటోందని ప్రధాని తెలిపారు. భారత్ లో తయారైన వ్యాక్సిన్లు ఓ మైలురాయిగా ఆయన అభివర్ణించారు. వందశాతం వ్యాక్సినేషన్ లక్ష్యానికి అనుగుణంగా భారత్ అడుగులు వేస్తోందన్నారు.

pm modi reply on motion of thanks to presidents address in rajya sabha

కరోనా మహమ్మారి సమయంలో 80 కోట్ల మంది ఉచిత రేషన్ అందుకున్నారని ప్రధాని మోడీ తెలిపారు. అలాగే 5 కోట్ల గ్రామీణ నివాసాలకు కరోనాలో సురక్షిత తాగునీరు అందించామన్నారు. జనం ఆకలితీర్చేందుకు కోవిడ్ సమయంలో పలు మౌలిక సౌకర్యాల ప్రాజెక్టుల్ని పూర్తి చేశామన్నారు. భారతీయ యువత కోవిడ్ అడ్డంకుల్ని దాటుకుని అంతర్జాతీయంగా క్రీడల్లో సత్తా చాటుకుందని ప్రధాని అభినందించారు. భారతీయ యువత స్టార్టప్ ల విషయంలో ప్రపంచంలోనే దేశాన్ని మూడోస్ధానంలో నిలిపిందన్నారు.

దేశంలో తొలిసారిగా రైతులు కనీసమద్దతు ధరను నేరుగా బ్యాంకు ఖాతాల్లో అందుకుంటున్నారని ప్రధాని మోడీ తెలిపారు.వ్యవసాయ రంగంలో సమస్యల పరిష్కారాన్ని కేంద్రం వేగంగా పరిష్కరిస్తుందన్నారు. ఎంఎస్ఎంఈల సాయంతో భారత్ ఇప్పుడు మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే ముందంజలో ఉందన్నారు. ఎంఎస్ఎంఈలు రక్షణ రంగంలోనూ అడుగుపెట్టాయని ప్రధాని గుర్తుచేశారు. రూ.200 కోట్ల లోపు ప్రాజెక్టులకు దేశీయంగానే టెండర్లు పిలిచే పరిస్ధితి తెచ్చినట్లు ప్రధాని తెలిపారు. కోవిడ్ ఆంక్షల తర్వాత ఉపాధి కల్పన రెట్టింపయిందన్నారు. ఐటీ రంగంలో గతేడాది 27 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు.యూపీఏ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరిందని ప్రధాని మోడీ గుర్తుచేశారు.

విపక్షాలు భారత్ కు నెగెటివ్ ఇమేజ్ తెచ్చే పనిలో బిజీగా ఉన్నాయని ప్రధాని ఆరోపించారు. భారత వ్యాక్సినేషన్ రికార్డును గర్వించలేని పరిస్దితుల్లో విపక్షాలు ఉన్నాయన్నారు. వ్యాక్సినేషన్ కోసం పెడుతున్న ఖర్చు వృథా అని ఓ ఎంపీ చెప్పారని మోడీ గుర్తుచేశారు. కరోనా సమయంలో వ్యూహరచన కోసం 23 సార్లు సీఎంలతో తాను సమావేశమైనట్లు మోడీ వెల్లడించారు. వీటిని బహిష్కరించడం ద్వారా విపక్షాలు నష్టపోయాయన్నారు. మరోవైపు భారత్ తన ఫార్మారంగాన్ని బలోపేతం చేసుకున్నట్లు మోడీ తెలిపారు. భారతీయ సంప్రదాయ ఔషధాల్ని విదేశాలూ గుర్తించాయన్నారు. బడ్టెట్ కు ముందు పన్నులు పెంచే ఆనవాయితీని తాము పక్కనపెట్టామని మోడీ తెలిపారు.

భారత్ కు వారసత్వ రాజకీయాలు భారీ ముప్పుగా మోడీ అభివర్ణించారు. కాంగ్రెస్ లేకుంటే దేశంలో ఎమర్జెన్సీ, సిక్కుల ఊచకోత జరిగి ఉండేవి కావని, అవినీతి, కశ్మీరీ పండిట్ల వెలివేత ఉండేవి కావని మోడీ పేర్కొన్నారు. దేశంలో బాలికలు సురక్షితంగా ఉండేవారని, జనానికి కనీస మౌలిక సౌకర్యాలు అందేవని మోడీ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని మోడీ గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+