కీలక సూచన చేసిన ప్రధాని మోదీ..!!
న్యూఢిల్లీ/షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. ఈ ఉదయం 8 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తంగా 55,92,828 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. మొత్తంగా 412 మంది అభ్యర్థుల భవితవ్యం ఇవ్వాళ్టి పోలింగ్‌తో తేలిపోనుంది. వారి రాజకీయ భవిషత్తు 55.92 లక్షల మంది ఓటర్ల చేతుల్లో ఉంది.

7,881 కేంద్రాలు..
పోలింగ్ సజావుగా సాగడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ వ్యాప్తంగా 7,881 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 7,235 బూత్‌లు గ్రామీణ ప్రాంతాలకు చెందినవే. మిగిలిన 646 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. కంగ్రా జిల్లాలో అత్యధికంగా 1,625 పోలింగ్ కేంద్రాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అతి తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న జిల్లా లాహౌల్-స్పితి. ఈ జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాల సంఖ్య 92.

మళ్లీ అధికారంలోకి..
ప్రస్తుతం భారతీయ జనత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం ఇది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమా కమలనాథుల్లో వ్యక్తమౌతోంది. తాము మరోసారి అధికారంలోకి వస్తామంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అన్నారు. పోలింగ్ ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ట్రెండ్ తమకు అనుకూలంగా ఉందని వ్యాఖ్యానించారు. తమకు మరోసారి అధికారాన్ని కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్న హిమాచల్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

గద్దె దిగక తప్పదు..
ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఓటర్లందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీకి ఓటమి తప్పదని హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి ప్రతిభా సింగ్ స్పష్టం చేశారు. ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. బీజపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని ఆమె చెప్పారు. అయిదేళ్ల బీజేపీ ప్రభుత్వ హయాంలో హిమాచల్ ప్రదేశ్ మరింత వెనుకపడిందని అన్నారు.

అభివృద్ధి పథంలో..
మరోసారి జైరామ్ ఠాకూర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన భార్య సాధన ఠాకూర్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ అయిదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించారని చెప్పారు. ఈ రోజు తమకు చాలా ప్రత్యేకమైనదని వ్యాఖ్యానించారు. జైరామ్ ఠాకూర్ విజయం సాధించాలని తాను ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో హిమాచల్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని అన్నారు.

మోదీ సూచన..
కాగా- హిమాచల్ ప్రదేశ్ పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ- అక్కడి ఓటర్లకు కీలక సూచన చేశారు. ప్రజాస్వామ్యంలో పోలింగ్ అనేది అతిపెద్ద పండగ అని వ్యాఖ్యానించారు. ఈ వేడుకలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్‌ను దేవభూమిగా అభివర్ణించారు. రికార్డు స్థాయి ఓటింగ్ శాతం నమోదవుతుందని చెప్పారు. తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకుంటోన్న వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
-
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications