ఆ మహిళల కన్నీళ్లకు ఇది ప్రధాని మోదీ సమాధానం.. సంచలన పిక్ వైరల్

పహల్గం ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది. 'ఆపరేషన్ సింధూర్' పేరిట భారత్ ఉగ్రమూకలపై విరుచుకుపడింది. ఇవాళ తెల్లవారుజామున పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలు, మౌలిక సదుపాయాలపై భీకర దాడులు నిర్వహించింది.

కీలకమైన 9 ఉగ్రవాద స్థావరాలను గుర్తించి కచ్చిత లక్ష్యంతో వైమానిక దాడులు నిర్వహించింది. ఈ మేరకు ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ దాడిలో 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ లోని బహావల్‌ పూర్, కోట్లీ, ముజఫరాబాద్‌ పై మిస్సైల్స్ దాడులు జరిగాయి.

PM Modi Responds to Women s Tears Viral Pic of Aparesh Sindoor Sparks Sensation

మోదీకి చెప్పాను..

పహల్గాం ఉగ్రదాడి ఘటన సమయంలో ఉగ్రవాదులు టూరిస్టు మహిళల వద్దకు వచ్చి వారి కళ్లముందే భర్తలను కిరాతకంగా హతమార్చారు. పోయి.. మోదీకి చెప్పు ఓట్లు వేసి గెలిపించారుగా అని ఆ టెర్రరిస్టులు భారత మహిళల ముందు అన్నారు. మరోవైపు చనిపోయిన తన భర్త పక్కన దీనంగా కూర్చుని ఏడుస్తున్న మహిళ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ పిక్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అయింది.

అయితే ఇప్పుడు మరో పిక్ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్ గా మారింది. ఈ ఫోటోలో టెర్రరిస్టులు మోదీకు చెప్పు అని ఓ వైపు ఉంటే.. మరోవైపు మోదీకి చెప్పాను అని ఓ మహిళ కోపంతో ఉగ్రమూకల శవాల మధ్య నిల్చొని ఉంది. ఇదే పిక్ లో పక్కన ఉగ్రవాది విలపిస్తూ ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటో వైరల్ అయింది.

ఇక కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సిందూర్ ఆపరేషన్‌ లో భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం పూర్తిగా నాశనమైంది. అతని కుటుంబంలో దాదాపు 10 మంది హతం అయ్యారు. ఇది భారత్ కు ఓ కీలక పరిణామంగా భావించవచ్చు. ఈ దాడిలో మసూద్ అజార్ కు చెందిన మరో నలుగురు అనుచరులు కూడా చనిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా మసూద్ నిర్ధారించాడు. పాకిస్తాన్ లోని బహావ్ పూర్ లోని సుబానల్లా మసీద్ పై భారత్ జరిపిన దాడిలో వీరంతా చనిపోయారని మసూద్ పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+