విస్తరణ: ప్రధాని మోడీ స్ట్రాటజీ, కొత్త మంత్రులు వీరే..

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరించారు. మొత్తం 19 మంది కొత్త వారికి ప్రధాని మోడీ తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. మంత్రి వర్గ విస్తరణలో దళితులు, ఓబీసీలకు ప్రాధాన్యం కల్పించారు. సభ్యుల వృత్తిపరమైన నైపుణ్యం, అనుభవానికి ప్రాధాన్యమిచ్చారని అంటున్నారు.

మంత్రివర్గంలో కొన్ని స్థానాలు మిత్రపక్షాలకు కేటాయించారు. పనితీరు ఆధారంగా ఇప్పుడున్న వారిలో కొందరికి పదోన్నతులు కల్పించి, మరికొందరికి ఉద్వాసన పలికారు. గతంలో సామాజిక, రాజకీయ సూత్రాలకు లోబడి పునర్‌ వ్యవస్థీకరణ జరిగింది. ఈసారి అభివృద్ధి అజెండాకే పెద్దపీట వేశారు.

విస్తరణ: ఏపీ-తెలంగాణలకు నో, 6గురు మంత్రులకు మోడీ ఉద్వాసన

మంగళవారం ఉదయం మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రకాశ్ జవదేకర్ ఒక్కరికే ప్రమోషన్ లభించింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో యూపీ నుంచి ఎక్కువ మందికి ప్రాధాన్యత ఇచ్చారు. అదీ దళితులకు, ఓబీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పటిదాకా 64 మంది మంత్రులు కేబినెట్లో ఉన్నారు. గరిష్ఠంగా 82కు పెంచుకునే వెసులుబాటు ఉంది.

PM Modi's Cabinet Reshuffle

ప్రమాణ స్వీకారం చేసింది వీరే..

ప్రకాశ్ జవదేకర్ - ప్రమోషన్ - కేబినెట్ హోదా
షగన్ సింగ్ కులస్తే (మధ్యప్రదేశ్)
ఎస్ఎస్ అహ్లూవాలియా (పశ్చిమ బెంగాల్)
రమేష్ జిగజ్నాగ్ (కర్నాటక)
విజయ్ గోయల్ (రాజస్థాన్)
రాందాస్ అథవాలే (మహారాష్ట్ర)
రజేన్ గోయెన్ (అసోం)
అనిల్ మాధవ్ దవే (మధ్యప్రదేశ్)
పురుషోత్తం రూపాలా (గుజరాత్)
ఎంజే అక్బర్ (మధ్యప్రదేశ్)
అర్జున్ రామ్ మేఘావాల్ (రాజస్థాన్)
జశ్వంత్ సిన్హ్ భభోర్ (గుజరాత్)
మహేంద్రనాథ్ పాండే (ఉత్తర ప్రదేశ్)
అజయ్ టాంటా (ఉత్తరాఖండ్)
కృష్ణరాజ్ (ఉత్తర ప్రదేశ్)
మన్‌సుఖ్ మాండవ్యా (గుజరాత్)
అనుప్రియా సింగ్ పటేల్ (ఉత్తర ప్రదేశ్)
సీఆర్ చౌదరి (రాజస్థాన్)
పిపి చౌదరి (రాజస్థాన్)
సుభాష్ భమ్రే (మహారాష్ట్ర)

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Faggan Singh Kulaste takes oath.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి