Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని మోడీ మన్ కీ బాత్ హైలైట్స్: హోలీపండుగ, పేరిణి, ఈ సంజీవనితోపాటు ఎన్నో!!

ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక అంశాలను ప్రస్తావించారు. భారతీయ కళలతో పాటు, ఈసారి హోలీ పండుగను వోకల్ ఫర్ లోకల్ అన్న కాన్సెప్ట్ తో జరుపుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు.

ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో అనేక అంశాలను ప్రస్తావించారు. భారతీయ కళలతో పాటు, ఈసారి హోలీ పండుగను వోకల్ ఫర్ లోకల్ అన్న కాన్సెప్ట్ తో జరుపుకోవాలని ప్రధాన మంత్రి సూచించారు.

హోలీ పండుగపై మోడీ చెప్పిందిదే

హోలీ పండుగపై మోడీ చెప్పిందిదే

ప్రతి ఒక్కరు ఆనందోత్సాహాల మధ్య హోలీ పండుగను జరుపుకోవాలని ప్రధానమంత్రి చెప్పారు. హోలీ షాపింగ్ లో స్థానిక ఉత్పత్తులను ఎంచుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. ఈసారి వోకల్ ఫర్ లోకల్ అన్న కాన్సెప్ట్ తో హోలీ జరుపుకోవాలని మోడీ సూచించిన ప్రధాని అందరికీ హోలీ శుభాకాంక్షలు ముందస్తుగా తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో క్రీడల నుండి బొమ్మలు కథల వరకు అనేక రకరకాల అంశాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చించారు. గతంలో మన్ కి బాత్ కార్యక్రమంలో బొమ్మల గురించి చెప్పుకున్నామని పేర్కొన్న మోడీ, భారతీయ బొమ్మలు ఎంతో క్రేజ్ ను సంపాదించుకున్నాయని, విదేశాలలో కూడా భారతీయ బొమ్మలకు విపరీతమైన డిమాండ్ ఉందంటూ తెలిపారు.

 ప్రతి ఒక్కరు స్వచ్ఛభారత్ కు భారీ సహకారాన్ని అందించాలన్న ప్రధాని

ప్రతి ఒక్కరు స్వచ్ఛభారత్ కు భారీ సహకారాన్ని అందించాలన్న ప్రధాని


భారతీయ కథాంశాలను గురించి మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పుకున్నప్పుడు వాటి ఖ్యాతి సుదూర ప్రాంతాలకు కూడా చేరిందని మోడీ పేర్కొన్నారు. సర్దార్ పటేల్ జయంతి యూనిటీ డే గా నిర్వహించామని ఈ పోటీలలో 700 జిల్లాల నుంచి ఐదు లక్షల మందికి పైగా పాల్గొన్నారని ప్రధాని మోడీ తెలిపారు. వేస్ట్ టు వెల్త్ అనేది స్వచ్ఛభారత్ అభియాన్ లోని ముఖ్యమైన కోణమని పేర్కొన్న మోడీ ప్రతి ఒక్కరు స్వచ్ఛభారత్ కు భారీ సహకారాన్ని అందించాలని, ప్లాస్టిక్ సంచుల స్థానంలో గుడ్డ సంచులు వాడాలని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో డిజిటల్ ఇండియా యొక్క శక్తి ప్రతి మూలలో కనిపిస్తుందని, డిజిటల్ ఇండియా యొక్క శక్తిని ప్రతి ఇంటికి తీసుకువెళ్లడంలో అనేక యాప్ లు కీలకపాత్ర పోషిస్తున్నాయని మోడీ తెలిపారు.

 ఈ సంజీవని యాప్ గొప్ప వరం అన్న మోడీ

ఈ సంజీవని యాప్ గొప్ప వరం అన్న మోడీ


ఇక యాప్ ల విషయానికి వస్తే ఈ సంజీవని యాప్ ద్వారా, ఎటువంటి రవాణా ఖర్చులు లేకుండా, ఇబ్బంది లేకుండా వైద్యులతో టెలి కన్సల్టేషన్ సహాయ లభిస్తుందని, ఈ యాప్ ను ఉపయోగిస్తున్న టెలి కన్సల్టెంట్ల సంఖ్య 10 కోట్లకు చేరుకుందని ప్రధాని మోడీ తెలిపారు. ఇది రోగులకు వైద్యులకు మధ్య అద్భుతమైన బంధాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ సంజీవని యాప్ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి తాను అభినందనలు తెలియజేస్తున్నానని మోడీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఈ సంజీవని యాప్ ప్రజలకు గొప్ప వరంగా నిలిచిందన్నారు ప్రధాని మోడీ.

 పేరిణి నాట్యం గురించి మాట్లాడిన మోడీ

పేరిణి నాట్యం గురించి మాట్లాడిన మోడీ


ప్రస్తుతం అనేక దేశాలు యూపీఐ వైపు ఆకర్షితులవుతున్నాయని భారతదేశంలో ఇప్పుడు యూపీఐ పాసీ లింక్ ప్రారంభమైందని, భారతదేశం మరియు సింగపూర్ రెండు దేశాల్లోని ప్రజలు సులభంగా డబ్బును బదిలీ చేసుకోవచ్చని ఈ పద్ధతులు మన జీవన సౌలభ్యాన్ని మరింత పెంచుతున్నాయని ప్రధాన నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో కళల గురించి మాట్లాడిన మోడీ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి పొందిన పేరిణి నృత్య కళ గురించి మాట్లాడారు. పేరిణి నాట్యం తెలంగాణ రాష్ట్రంలోని కాకతీయుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన నాట్యం అని, అటువంటి పేరిణి నాట్యానికి రాజ్ కుమార్ నాయక్ విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్నారు అన్నారు. చరిత్రను సంస్కృతిని కాపాడడం కోసం కళాకారులను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. కళలను కళాకారులను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రధాని మోడీ అభినందించారు. అంతే కాదు ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ను గుర్తు చేసుకున్నారు.

'ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం అవార్డులపై మోడీ చెప్పిందిదే

'ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం అవార్డులపై మోడీ చెప్పిందిదే


'ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారం' అవార్డుల కార్యక్రమం పై మాట్లాడిన మోడీ సంగీతం మరియు కళల రంగంలో వర్ధమాన, ప్రతిభావంతులైన కళాకారులకు అందించబడ్డాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. జయదీప్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని పొందిన వారిలో ఒకరిని మోడీ పేర్కొన్నారు. 50- 60 దశకాలుగా వినడానికి సాధ్యం కాని సుర్ సింగార్ సంగీత సాధనాన్ని మళ్లీ పాపులర్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. ఉప్పలపు నాగమణి కూడా మాండోలిన్ లో కర్ణాటక సంగీతాన్ని ప్రసిద్ధి చేస్తున్నందుకు పురస్కారాన్ని అందుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పేరిణి నృత్య ప్రదర్శన ప్రసిద్ధి చెందిన రాజకుమార్ కూడా ఈ కోవకు చెందిన వారిని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

 ప్రజల భాగస్వామ్య వ్యక్తీకరణకు మన్ కీ బాత్ అద్భుతమైన వేదిక

ప్రజల భాగస్వామ్య వ్యక్తీకరణకు మన్ కీ బాత్ అద్భుతమైన వేదిక

మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పౌరులు అద్భుతమైన వేదికగా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంటింటికి డిజిటల్ సేవలను అందించాలన్నారు. ప్రతి ఇంటికి డిజిటల్ సేవలు అందినప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నారు మోడీ. ప్రజల భాగస్వామ్య వ్యక్తీకరణకు మన్ కీ బాత్ అద్భుతమైన వేదిక అని ప్రధాన నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మనో శక్తితో సామాజిక శక్తి పెరుగుతుందని, అదే దేశానికి శక్తిగా మారుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన మోడీ మన్ కీ బాత్ దేశంలోని ఎంతో మందికి ఉత్సాహాన్ని, ప్రేరణను ఇస్తుందని భావిస్తున్నారు దేశ ప్రజలు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+