వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదంలో ప్రధాని మోదీ - తల్లి హీరాబెన్ కన్నుమూత..!!

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోదీకి మాతృ వియోగం కలిగింది. ప్రధాని తల్లి హీరాబెన్ మోదీ కన్నుమూపారు. కొద్ది రోజుల క్రితమే 100వ జన్మదినం చేసుకున్నారు. కొద్ది రోజులుగా హీరాబెన్ అస్వస్థతతో ఉన్నారు. తాజాగా అహ్మదాబాద్ ఆస్పత్రిలో హీరాబెన్ చికిత్స తీసుకున్నారు. కోలుకుంటున్నట్లుగా ప్రకటించారు. ప్రధాని మోదీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని పరామర్శించారు. కొద్ది గంటల్లో హారాబెన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. విషాద వార్త బయటకు వచ్చింది. అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో హీరాబెన్ మోదీ తుదిశ్వాస విడిచారు.

తాజాగా తన తల్లి వందో జన్మదినం నాడు ప్రధాని అహ్మదాబాద్ లో తన తల్లి వద్దకు వచ్చారు. సోదరుడి నివాసంలో ఉన్న తల్లితో కొద్ది సేపు ఆప్యాయంగా గడిపారు. గుజరాత్ ఎన్నికల్లోనూ హారాబెన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసే ముందు కూడా ప్రధాని తన తల్లి వద్దకు వెళ్లారు. ఇప్పుడు హఠాత్తుగా హీరాబెన్ మరణంతో ప్రధాని విషాదంలో మునిగిపోయారు. తన తల్లి మరణం పై ప్రధాని ట్వీట్ చేసారు. తన తల్లి వందో జన్మదినం నాడు తనకు ఏం చెప్పారో వివరించారు. స్వచ్చమైన ప్రేమతో సేవలు అందించాలని.. మేధస్సును వినియోగించి పని చేయాలని సూచించిన మాటలను ప్రధాని షేర్ చేసుకున్నారు.

PM Modis mother Heeraben Modi dies at the age of 100

ప్రధాని మోదీ తల్లి కన్నుమూసిన వార్తతో రాజకీయాలకు అతీతంగా ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. మరి కాసేపట్లో ప్రధాని అహ్మదాబాద్ చేరుకోనున్నారు. హీరాబెన్ మోదీ స్వస్థలం గుజరాత్‌లోని మెహసానాలోని వాద్‌నగర్. ఆమె భర్త దామోదర్ దాస్ మూల్‌చంద్ . ఈ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మూడవ సంతానం ప్రధాని మోదీ. 2016 నవంబరులో పాత కరెన్సీ నోట్లను బ్యాన్ చేయడంపై తన కుమారుడి నిర్ణయానికి మద్దతుగా ఏటీఎంల వద్ద క్యూలో నిలబడి అందరిని ఆకర్షించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడికి ఓటు వేయాలని హీరాబెన్ మోదీ ప్రచారంలో పాల్గొన్నారు. తన తల్లితో ఉన్న అనుబంధం గురించి పలు సందర్భాల్లో ప్రధాని మోదీ వివరించారు.

English summary
Prime Minister Narendra Modi's mother Heeraben Modi passed away at the age of 100.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X