ముస్లీంలకు రిజర్వేషన్లు ఇస్తారా?, ఆంధ్రాలో ఏం జరిగిందో గుర్తు లేదా?, మోదీ సూటి ప్రశ్నలు!
లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సందర్బంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఎన్నికల హామీలు వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పుడు దేశం మొత్తం హాట్ టాపిక్ లో ఉన్న విషయం ముస్లీంల రిజర్వేషన్. ముస్లిం కమ్యూనిటీకి రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడుతున్నారు. ముస్లీంలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారు అంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని నిలదీస్తున్నారు.
మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 1990ల నాటి నుంచి ముస్లీంలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రస్తావిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే ముస్లీంలను మాయ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ చరిత్రను చూస్తే 1990 కాలం నుంచి ఇదే ముస్లీం రిజర్వేషన్ల డ్రామాను ముందుపెట్టుకుని నాటకాలు వేస్తోందని మోదీ మండిపడ్డారు. జనాభాలో ఒక ముఖ్యమైన వర్గం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తోందని మోదీ గుర్తు చేశారు.

1990 నుంచి కాంగ్రెస్ రిజర్వేషన్ల అణిచివేసేందుకు, ఆ బిల్లును వ్యతిరేకించడానికి ప్రయత్నించిందని, అనేక కమిషన్లు, నివేదికలు ఓబీసీలకు అనుకూలంగా మాట్లాడటం ప్రారంభించాయని మోదీ గుర్తు చేశారు. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ఓబీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఇప్పటికి తిరస్కరిస్తూనే ఉందని ప్రధాని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మొత్తం ముస్లిం సమాజాన్ని ఓబీసీ రిజర్వేషన్‌కి తీసుకువచ్చిందని, . 1990 లలో కాంగ్రెస్ వారు మతపరమైన రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారని మోదీ గుర్తు చేశారు.
ముస్లింలందరినీ ఓబీసీలుగా వర్గీకరించారు. అదే సమయంలో ఓబీసీల డిమాండ్లను తిరస్కరించారని, కానీ రాజకీయాల కోసం కాంగ్రెస్ ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారని మోదీ గుర్తు చేశారు. 2004లో కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు. రాజ్యాంగం ద్వారా ఓబీసీ కమ్యూనిటీకి ఇచ్చిన 27% రిజర్వేషన్లను ఉల్లంఘించడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారని ప్రధాని మోదీ ఆరోపించారు. 2006లో జాతీయ అభివృద్ధి మండలి సమావేశం జరిగిందని మోదీ అన్నారు.
మన్మోహన్ సింగ్ ప్రకటన పెద్ద దుమారాన్ని రేపిందని, రెండేళ్లు మౌనంగా ఉండి 2009 మేనిఫెస్టోలో మరోసారి ముస్లీంల రిజర్వేషన్లు ప్రతిపాదించి 2011లో ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నించారని, 2012 యూపీ ఎన్నికల్లోనూ తాము ముస్లీంలకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి రిజర్వేషన్లు కల్పించడానికి విఫలయత్నం చేశారని మోదీ అన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వలేం అని ప్రధాని మోదీ అన్నారు.
2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముస్లీంల రిజర్వేషన్లను కొట్టివేసిందని, సుప్రీంకోర్టుకు వెళ్లినా పరిష్కారం దొరకలేదని, 2014 మేనిఫెస్టోలో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ మరోసారి ప్రతిపాదించారని మోదీ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ రాజ్యాంగ కమిటీలో భాగం కాదని మోదీ అన్నారు. అయితే భారతదేశంలో మతం పేరుతో రిజర్వేషన్లు ఉండకూడదని నిర్ణయించామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications