కాంగ్రెస్ పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు - గేమ్ షురూ..!!

ప్రధాని మోదీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని కాంగ్రెస్ నాయకత్వాన్ని టార్గెట్ చేసారు. కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమైన ఎజెండాను ఓడించేందుకు ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని అర్బన్ నక్సల్స్ ముఠా నడుపుతోందని వ్యాఖ్యానించారు. దసరా తరువాత ఏ క్షణమైనా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందనే అంచనాల వేళ బీజేపీ..కాంగ్రెస్ ఎన్నికల సమరానికి సై అంటూ పోటా పోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి.

కాంగ్రెస్ పై గురి
మహారాష్ట్ర వాషిమ్ జిల్లాలో వివిధ ప్రాజెక్ట్‌లు ప్రారంభించిన మోదీ, అనంతరం నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల దిల్లీలో వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు (డ్రగ్స్‌) పట్టుబడ్డాయని గుర్తు చేసారు. ఇవి ఓ కాంగ్రెస్ నేతవి అని అనుమానిస్తున్నారని చెప్పుకొచ్చారు. యువతను డ్రగ్స్‌ వైపు మళ్లించి, ఆ డబ్బుతో ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆరోపించారు. భారతదేశాన్ని కేవలం ఒక కుటుంబం మాత్రమే పాలించాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

PM Modi said the Congress is being ruled by a gang of urban Naxals

వారికి అదే భయం
మనమంతా ఏకమైతే, దేశాన్ని విభజించాలనే వారి ఎజెండా విఫలమవుతుందని కాంగ్రెస్ భయపడుతోందని మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని వ్యక్తులతో కాంగ్రెస్ ఎంత సన్నిహితంగా ఉంటోందో ప్రజలు చూస్తున్నారని మోదీ పేర్కొన్నారు. వ్యవసాయం, పశుసంవర్ధక రంగాలకు సంబంధించి రూ.23,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ వాషిమ్‌లో ప్రారంభించారు. అంతకు ముందు బంజారా ప్రజల గొప్ప వారసత్వాన్ని తెలిపే, బంజారా విరాసత్ మ్యూజియంను ఆరంభించారు.

ప్రారంభోత్సవాలు
అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్ (ఏఐఎఫ్‌) కింద రూ.1,920 కోట్ల విలువైన 7500కు పైగా ప్రాజెక్ట్‌లను ప్రధాని మోదీ ప్రారంభించారు. వీటిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు, గిడ్డంగులు, సార్టింగ్ అండ్ గ్రేడింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లు, పోస్ట్‌-హార్వెస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే దాదాపు రూ.1300 కోట్ల టర్నోవర్‌ సామర్థ్యం కలిగిన 9200 ఫార్మర్‌ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ)లను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+