వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ బ్లెండింగ్‌- ప్రధాని మోడీ కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

భారత్‌ ప్రస్తుతం క్లీన్‌ ఎనర్జీ వైపు పరుగులు తీస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. ఆర్ధిక వ్యవస్ధ, జీవావరణం రెండూ కలిసి పనిచేయడం సాధ్యమేనని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. ఇవాళ మన దేశం ఓ సమగ్ర రోడ్‌మ్యాప్‌ విడుదల చేయడం ద్వారా ఇథనాల్ రంగంలో ఓ పెద్ద అడుగు వేసిందన్నారు. దేశవ్యాప్తంగా పర్యావరణహిత ఇథనాల్‌ తయారీకి సిద్ధంగా ఉన్నట్లు మోడీ వెల్లడించారు.

Recommended Video

PM Modi Inaugurates 3 Ethanol Stations, భవిష్యత్తు లో కాలుష్యం తగ్గుతుంది || Oneindia Telugu
PM Modi says India resolved to meet target of 20% ethanol blending in petrol by 2025

ఇథనాల్ ఉత్పత్తి కోసం ఉద్దేశించిన ఈ-100 పైలట్‌ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా పూణేలో మూడు పెట్రోల్ పంపుల నుంచి ఇథనాల్‌ పంపిణీ చేయబోతున్నారు. ఏడేళ్ల క్రితం ఇథనాల్ గురించి ఎలాంటి చర్చా లేదని, కానీ 2025 నాటికి దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ బ్లెండింగ్‌ను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని తెలిపారు. 2014లో భారత్‌లో కేవలం 1.5 శాతం ఇథనాల్‌ బ్లెండింగ్‌ చేసే వారమని, కానీ ఇప్పుడు అది 8.5 శాతానికి చేరిందన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమం పెంచడం వల్ల దేశంలో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

English summary
Highlighting the Centre’s efforts towards sustainable development, Modi said India's capacity for renewable energy has increased by more than 250 per cent in the last 6-7 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X