ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు..!!

ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పరీక్షల వేళ విద్యార్ధులకు ఒత్తిడి నివారణకు టిప్స్ సూచించారు. తన జీవిత అనుభవాలను వారితో పంచుకున్నారు. ఏ విషయంలోనూ ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని సూచించారు. భయాన్ని అధిగమిస్తూ పరీక్షలకు సిద్దం కావాలని పేర్కొన్నారు. చదువుతో పాటు ఆటపాటలు కూడా ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు. మనం రోబోలం కాదని.. మనుషులమని చెప్పారు.

పరీక్షల వేళ ప్రధాని మోదీ పరీక్ష పే చర్చ నిర్వహించారు. ఇందు కోసం 3.15 కోట్ల మంది విద్యా ర్థులు రిజిస్టర్ చేసుకోగా, అందులో 19.80 లక్షల మంది టీచర్లు, 5.20 లక్షల మంది తల్లి దం డ్రులు ఉన్నారు. నేరుగా మాత్రం 36 మంది, మిగతావారంతా వర్చువల్‌గా పాల్గొన్నారు. పీఎం మోదీ విద్యార్ధులకు కీలక సూచనలు చేసారు. ఆటలు కూడా ముఖ్యమని పేర్కొన్నారు. క్రీడల ద్వారా రోజంతా పడిన శ్రమ, ఒత్తిడి అంతా పోయి ఉపశమనం లభిస్తుందన్నారు. విద్యార్ధులకు రిలాక్సేషన్ అవసరమని చెప్పారు. విద్యార్ధులను ఒకే చోట బంధించి పుస్తకాల పురుగుగా మార్చే యడం సరికాదని పేర్కొన్నారు.

PM Modi shared stress management tips with students in his Parikhsa pe charcha

విద్యార్ధులకు కొన్ని ఇష్టాఇష్టాలు ఉంటాయని.. అవి చేసే స్వేచ్ఛ ఇస్తే చదువులోనూ ముందంజలో ఉంటారని సూచించారు ప్రధాని. పరీక్షలే జీవితం అనుకోవద్దని.. ఇలాంటి ఆలోచన కరెక్ట్ కాద న్నారు మోడీ. స్టూడెంట్స్ ఎగ్జామ్స్, స్కూల్ పాఠాల దగ్గరే ఆగిపోవద్దని.. జ్ఞానాన్ని పెంచుకోవడం మీద కూడా దృష్టి పెట్టాలన్నారు. జ్ఞానం ఎంత పెంచుకున్నా తక్కువేనన్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండి పరీక్షలకు సిద్ధం కావాలని ప్రధాని సూచించారు. విద్యార్ధులు ఆరో గ‌్యంగా ఉన్నప్పుడే చదువుపై సరిగా దృష్టి పెట్టగలుగుతారని చెప్పారు.

సవాళ్లను ఎదుర్కోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సలహా ఇచ్చారు. సరైన దినచర్య, అధ్యయన సమయం రూపొం దించుకోవాలని సూచించారు. పోషణలో శరీర ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ సాధించడంలో నిద్ర పాత్ర చాలా ఎక్కువని వివరించారు. ఎలాంటి ఒత్తిడి ఉన్నా పట్టించుకో కుండా స్వతహాగా పరీక్షలకు సిద్ధం కావాలని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+